పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas)ప్రస్తుతం 'ది రాజాసాబ్'(the raja saab)షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.కల్కి 2898 ఏ డి వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత ప్రభాస్ నుంచి రాబోయే
మూవీ కావడంతో రాజా సాబ్ పై అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హర్రర్ అండ్ కామెడీ మూవీలో ప్రభాస్ సరసన నిది అగర్వాల్ హీరోయిన్ గా చేస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టి జె విశ్వ ప్రసాద్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు.
ఇక అసలు విషయానికి వస్తే వచ్చే నెల 3 న'కల్కి' భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్ర యూనిట్ భారీ ఎత్తున ప్రమోషన్స్ ని నిర్వహించడానికి ప్లాన్ చేసింది.ప్రభాస్ తో పాటు చిత్ర యూనిట్ మొత్తం
ప్రమోషన్స్ లో పాల్గొంటుందని చాలా రోజుల క్రితమే అధికారంగా వెల్లడి కూడా చేసింది.కానీ ఒక సినిమా షూటింగ్ చిత్రీకరణ సమయంలో కాలు యొక్క చీలమండ బెనికిందని, అందుకే ప్రమోషన్స్ కి
వెళ్లలేకపోతున్నానని ప్రభాస్ ప్రకటించాడు.రాజా సాబ్ సినిమా షూటింగ్ లో ప్రభాస్ కి గాయమయి ఉంటుందని తెలుస్తుంది.
ఇక ప్రభాస్ గాయాల గురించి తెలుసుకున్న ఫ్యాన్స్ ప్రభాస్ త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.సలార్ 2 ,స్పిరిట్ అనే మూవీలు కూడా ప్రభాస్ లిస్ట్ లో
ఉన్నాయి.ప్రస్తుతం అవి ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.