![]() |
![]() |

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ 'ఛత్రపతి' రీమేక్ తో బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు. వీవీ వినాయక్ దర్శకత్వంలో పెన్ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదల కాకముందే శ్రీనివాస్ మరో రెండు హిందీ సినిమాలు సైన్ చేసినట్లు తెలుస్తోంది. బెల్లంకొండ తీరు చూస్తుంటే బాలీవుడ్ పైనే పూర్తి దృష్టి పెట్టేలా ఉన్నాడు.
డబ్బింగ్ సినిమాలతో బెల్లంకొండ నార్త్ ప్రేక్షకులకు సుపరిచితమే. ఆయన నటించిన పలు సినిమాలు హిందీలో డబ్ అయ్యి, యూట్యూబ్ లో విడుదల కాగా మిలియన్లలో వ్యూస్ ని సంపాదించాయి. యూట్యూబ్ లో నార్త్ ప్రేక్షకుల నుంచి ఆ స్థాయి ఆదరణ పొందిన అతికొద్ది మంది సౌత్ హీరోలలో శ్రీనివాస్ ఒకరు. దీంతో ఆయన ఛత్రపతి' రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. 2021 లోనే లాంచ్ అయిన ఈ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న పెన్ స్టూడియోస్ బెల్లంకొండకు మరో రెండు హిందీ సినిమాల్లో నటించే అవకాశం ఇచ్చింది. బెల్లంకొండ సైతం ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఆ రెండు సినిమాలకు సైన్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ రెండు సినిమాల్లో ఒకదానికి వినాయక్ దర్శకత్వం వహించనున్నాడని సమాచారం. దీంతో బెల్లం అన్న ఇక బాలీవుడ్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టి, తెలుగు సినిమాలు చేయడా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
![]() |
![]() |