![]() |
![]() |

సినిమా కోసం ఎలాంటి రిస్క్ అయినా చేసే అతి కొద్ది మంది స్టార్స్ లో కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ ఒకరు. ఆయన సినిమా కోసం తన దేహాన్ని ఎలా కావాలంటే అలా మలుస్తారు. దాని వల్ల కొన్నిసార్లు అనారోగ్యం పాలయ్యారు కూడా. అలాగే షూటింగ్ సమయంలో యాక్షన్ సన్నివేశాల కోసం రిస్క్ చేస్తుంటారు. అలా చేసి తాజాగా ఆయన తీవ్రంగా గాయపడ్డారు.
ఇటీవల 'పొన్నియిన్ సెల్వన్-2'తో ప్రేక్షకులను పలకరించిన విక్రమ్.. ప్రస్తుతం పా రంజిత్ దర్శకత్వంలో 'తంగలాన్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కోలార్ బంగారు గనుల కార్మికుల జీవిత కథల ఆధారంగా రూపొందుతోన్న ఈ మూవీ కొత్త షెడ్యూల్ చెన్నైలో జరుగుతుంది. 'పిఎస్-2' ప్రమోషన్స్ కోసం కొన్నిరోజులు 'తంగలాన్' షూటింగ్ కి బ్రేక్ ఇచ్చిన విక్రమ్.. మళ్ళీ నిన్నటి నుండి షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అయితే ఈరోజు ఉదయం యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో విక్రమ్ కి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయన పక్కటెముకలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించగా.. పక్కటెముక విరిగిందని గుర్తించిన వైద్యులు, ఆయనకు చికిత్స అందించారు. విక్రమ్ పూర్తిగా కోలుకొని మళ్ళీ షూటింగ్ లో పాల్గొనడానికి కొన్ని వారాలు పట్టే అవకాశముంది.
![]() |
![]() |