![]() |
![]() |

తమిళ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు మనోబాల(69) కన్నుమూశారు. కొంతకాలంగా లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన చెన్నై లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు.
నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రస్థానంలో దర్శకుడిగా 20 కి పైగా సినిమాలు, నటుడిగా 300 కి పైగా సినిమాలు చేశారు మనోబాల. తమిళ లో నటుడిగా, దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన మనోబాల తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఎన్నో డబ్బింగ్ సినిమాలతో అలరించారు. ఆయన కామెడీని ఇష్టపడేవారు ఎందరో ఉన్నారు. డబ్బింగ్ సినిమాలతోనే కాకుండా.. నేరుగా కొన్ని తెలుగు సినిమాల్లోనూ నటించి మెప్పించారు మనోబాల. చివరిగా ఆయన చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య'లో జడ్జిగా కనిపించారు.
![]() |
![]() |