మెగాస్టార్ చిరంజీవి మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. సీనియర్ సినిమాటోగ్రాఫర్ దేవరాజ్ కు రూ. 5 లక్షల ఆర్ధిక సాయం చేశారు. 1980-90 లలో ఆయన టాప్ సినిమాటోగ్రాఫర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు వివిధ భాషల్లో కలిపి 300 కు పైగా సినిమాలకు పని చేశారు. చిరంజీవి నటించిన 'రాణి కాసుల రంగమ్మ', 'టింగు రంగడు', 'పులి బెబ్బులి', 'నాగు' వంటి సినిమాలకు ఆయన కెమెరామన్ గా వ్యవహరించారు. సినిమాటోగ్రాఫర్ గా ఎంతో పేరు తెచ్చుకున్న ఆయన ప్రస్తుతం వృద్ధాప్య సమస్యలతో పాటు ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం చిరంజీవి దృష్టికి రావడంతో వెంటనే స్పందించి దేవరాజ్ కు రూ. 5 లక్షల ఆర్ధిక సాయం అందించారు. దీంతో చిరంజీవిపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.