కే జి ఎఫ్ చాప్టర్ 2 విడుదలై ఏడాది కావొస్తోంది . కానీ కె .జి. ఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2 ల తర్వాత ఇందులో హీరోగా నటించిన రాఖీభాయ్ అలియాస్ యష్ నటించిన మరో చిత్రం ఇప్పటివరకు అనౌన్స్ కాలేదు. ఆయన తదుపరిచిత్రం పై ఇప్పటివరకు క్లారిటీ లేదు. బర్త్‌డేకి కూడా ఏ సినిమా ప్రకటన చేయలేదు. ఏ సినిమాలకు ఆయన ఇంకా కమిట్ కాలేదు. అయితే ఓ చిత్రానికి ఆయన ఓకే చెప్పాడని వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ ఫిలిం మేకర్ నితీష్ తివారి, మధు మంతెన, అల్లు అరవింద్ లు తీయనున్న భారీ రామాయణం ప్రాజెక్టులో యష్ ని నటింపజేసేందుకు వారు సంప్రదించారు అని వార్తలు వస్తున్నాయి. రాముడి పాత్రకు గాను రణబీర్ కపూర్‌ను ఫైనల్ చేసిన టీం రావణుడి పాత్రకు యష్ తో సంప్రదింపులు జరిపారు అంటున్నారు.
యష్‌కు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్డం ఉంది. ఇలాంటి సమయంలో రావణుడి పాత్ర చేయడం సరికాదు అంటున్నారు ఆయన అభిమానులు. అందునా రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తుంటే రావణుడిగా యష్ ఎలా చేస్తాడు? రామాయణం అన్న తర్వాత అందులో హీరో రాముడు అయితే విలన్ రావణుడు కదా...! మరి అలాంటి విలన్ పాత్రలో యష్ నటించడం సరికాదనేది కొందరి వాదన. రాఖీ బాయ్ గా పాన్ ఇండియా స్టార్ అయిన యష్ ను అదే స్థాయి పాత్రలో చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. రాఖీ బాయ్ కాస్త ఆలస్యంగా అయినా కేజీఎఫ్ వంటి మాస్ పాత్రను చేస్తే బాగుంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి మొత్తానికి రామాయణం ఎంతవరకు కరెక్ట్ అనేది యష్ స్పందిస్తే గాని క్లారిటీ వచ్చే అవకాశం లేదు.