![]() |
![]() |

ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే ఖుషి, తొలిప్రేమ, తమ్ముడు, మహేష్ బాబు ఒక్కడు, జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి వంటి చిత్రాలన్నీ ఫోర్ కే లో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. రాజమౌళి ఎన్టీఆర్ ల కాంబినేషన్లో వచ్చిన సింహాద్రి చిత్రాన్నిమే 20వ తేదీన యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్‌డే కానుకగా రీ రిలీజ్ చేయనున్నారు. ఇలా ఖుషి, ఒక్కడు త్వరలో రానున్న సింహాద్రి చిత్రాలన్నింటిలో భూమికనే హీరోయిన్ అన్నది గమనించాల్సిన విషయం. మొత్తంగా ఈ మూడు రీరిలీజ్ మూవీలలో భూమిక హీరోయిన్ కావడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఆ ఘనత సాధించడం భూమికాకు మాత్రమే సాధ్యమైందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
ఒక హీరోయిన్ కి సంబంధించిన మూడు సినిమాలు రీ రిలీజ్ కావడం సినీ చరిత్రలో ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. ఆ ఫేట్ భూమికకు మాత్రమే సాధ్యమైంది. 4k వెర్షన్స్ లో వస్తున్న ఈ మూవీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఓ విధంగా చెప్పాలంటే తారక్ కి ఈ మూవీనే స్టార్ ఇమేజ్ ని తీసుకొచ్చింది. స్టూడెంట్ నెంబర్ 1, ఆది తరువాత ఆయన రేంజ్ ని పెంచిన చిత్రంగా సింహాద్రిని చెప్పుకోవచ్చు. ఇది రాజమౌళి తారక్ ల కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా. ఓ విధంగా చెప్పాలంటే రాజమౌళికి కూడా ఈ సినిమా కమర్షియల్ డైరెక్టర్ అనే బ్రాండ్ ను తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
![]() |
![]() |