![]() |
![]() |

దిల్ రాజు.... సినిమా హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ప్రతి ఏడాది చిత్రాలు తీస్తూనే ఉంటారు. ఆయన తీసిన చిత్రాలు ప్రతి సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉంటాయి. ఈయన ఎక్కువగా ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్ ఉండే కదా చిత్రాలను ఎంపిక చేసుకుంటూ ఉంటారు. కానీ ఈయన తీసిన కొన్ని చిత్రాలు ఈమధ్య బాగా నిరాశపరిచాయి. కృష్ణాష్టమి, వెళ్లిపోమాకే, లవర్, శ్రీనివాస కళ్యాణం, ఇద్దరిలోకం ఒకటే, జాను, వి, షాదీ ముబారక్, రౌడీ బాయ్స్, థాంక్యూ చిత్రాలు బాగా నిరాశపరిచాయి. వీటిలో ఎఫ్2 చిత్రం మాత్రమే మంచి విజయాన్ని సాధించింది. ఎఫ్3 చిత్రం ఫర్వాలేదనిపించింది. పవన్ కళ్యాణ్ తో చేసిన వకీల్ సాబ్ కు మంచి పేరు అయితే వచ్చింది గాని దానికి తగ్గ లాభాలను మాత్రం సాధించలేకపోయింది. కాగా తాజాగా దిల్ రాజు కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్‌తో చేసిన వారీసు చిత్రం విడుదలై అక్క ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇదే చిత్రాన్ని తెలుగులో వారసుడిగా డబ్బింగ్ చేశారు. కానీ ఇక్కడ కూడా ఈ చిత్రం ఫ్లాప్ దిశగా సాగుతోంది. ఇక విషయానికి వస్తే టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న ఈయన ఎన్నో సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా కూడా వ్యవహరించారు.
ఒకవైపు చిన్న సినిమాలను ప్రొడ్యూస్ చేస్తూనే పాన్ ఇండియా స్థాయి సినిమాలను కూడా నిర్మిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నారు. ఈయన అనిత అనే మహిళను వివాహం చేసుకున్నారు. ఆమె గుండెపోటుతో మరణించడంతో మూడు సంవత్సరాల పాటు ఒంటరిగా ఉన్నారు. కూతురు ప్రోద్బలంతో రెండో పెళ్లి చేసుకున్నారు. ఆయన రెండో వివాహం తేజస్విని అనే అమ్మాయితో జరిగింది. వీరిది లవ్ కం అరేంజ్డ్ మ్యారేజ్ అని దిల్ రాజు తాజాగా ఇంటర్వ్యూలో తెలిపారు. తన భార్య అనిత మరణించిన తర్వాత నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను. అయితే నా జీవితంలో సరికొత్త నిర్ణయం తీసుకోవాలంటే నేను ఉన్న బిజీ లైఫ్ కారణంగా నన్ను అర్థం చేసుకునే వారి కోసం వెతుకుతున్నాను. అదే సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో తేజస్విని నాకు పరిచయమైంది.
ఆమె ఫోన్ నెంబర్ తీసుకొని దాదాపు ఏడాది పాటు ఆమెను గమనించాను. అనంతరం ఆమె నాకు పర్ఫెక్ట్ ఛాయిస్ అని తెలుసుకున్నాను. ఆ తరువాత ఆమెకు ప్రపోజ్ చేశాను. ఇలా నేను తనకు ప్రపోజ్ చేయడం, తను ఆ ప్రపోజల్ కి ఓకే చెప్పిన తర్వాత ఈ విషయాన్ని ఇంట్లో వారికి చెప్పి అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నామని దిల్ రాజు తన రెండో పెళ్లి వెనుక స్టోరీని బయటపెట్టారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తేజస్విని ఎయిర్ హోస్టెస్ గా పని చేసేది. ఆ సమయంలోనే దిల్ రాజు ఆమెను గమనిస్తూ ఆమె ప్రేమలో పడ్డాడని తెలుస్తోంది. ఈ దంపతులకు ఓ కుమారుడు జన్మించిన విషయం మనకు తెలిసిందే. మొత్తానికి ఏవో సరికొత్త ప్రేమకథలు, కుటుంబ కథా చిత్రాల కోసం వెతకనవరసరం లేకుండా దిల్ రాజు తన లవ్ స్టోరీ, భార్య మరణించిన తర్వాత కుమార్తె ప్రోద్భలంతో వివాహం చేసుకోవడం వంటి వాటిని కథలుగా మలిచి చిత్రాలు తీస్తే సినిమాలుగా సూపర్ హిట్ అవ్వడం గ్యారంటీ అని చెప్పాలి.
![]() |
![]() |