![]() |
![]() |
.webp)
"మైఖేల్" మూవీలో నటించిన యాంకర్ అనసూయ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్.ఇక ఈ మూవీలో హీరో సందీప్ కిషన్ లీడ్ రోల్‌లో నటిస్తున్నాడు. విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించి అలరించబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రంజిత్ జయకోడి డైరెక్ట్ చేశారు. ఈ మూవీ తెలుగు,తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఫిబ్రవరి 3న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. రిలీజ్ కి పెద్దగా టైం కూడా లేకపోయేసరికి ప్రమోషన్స్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు మేకర్స్.
ఇక ఈ మూవీలో నటించిన ఒక్కో పాత్రను ఆడియన్స్ కి పరిచయం చేస్తున్నారు. యాంకర్ అనసూయ " మైఖేల్ " మూవీలో చారులతగా కనిపించబోతోంది. బ్లాక్ శారీలో ఒక అగ్రెసివ్ లుక్ తో మ్యాడ్ క్వీన్‌గా కనిపించింది అనసూయ. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ అంచనాలను పెంచుతోంది. ముఖ్యంగా ట్రైలర్‌లో వచ్చే డైలాగ్‌లు చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. ‘వేటాడ్డం రాని జంతువులే వేటాడే నోటికి చిక్కుతాయి’ ‘వెంటాడి ఆకలి తీర్చుకోవడానికి.. వేటాడ్డం తెలియాల్సిన అవసరం లేదు’ ‘మన్నించేటప్పుడు మనం దేవుడు అవుతాం’ ‘నేను మనిషిగానే ఉంటాను మాస్టర్’ అనే నాలుగు డైలాగ్స్ తో ఉన్న ఈ ట్రైలర్ చూస్తేనే చాలు ఈ మూవీ ఏదో మ్యాజిక్ చేయబోతోందని అర్ధమవుతుంది.
![]() |
![]() |