![]() |
![]() |

గుణశేఖర్ పౌరాణిక చిత్రం 'శాకుంతలం'లో అల్లు అర్జున్ ముద్దుల తనయ అర్హ నటిస్తోంది. శకుంతల, దుష్యంతుల కుమారుడు భరతుని పాత్రను అర్హ పోషిస్తోంది. శకుంతలగా సమంత నటిస్తోండగా, దుష్యంతుని పాత్రను మలయాళం నటుడు దేవ్ మోహన్ చేస్తున్నాడు. శాకుంతలం సెట్స్‌కు అల్లు అర్జున్ కారవాన్ 'ఫాల్కన్' వస్తుండటం గమనార్హం. అంటే చిన్నారి అర్హ కోసం అది వస్తోందన్న మాట.
మోడరన్ హౌస్‌లో ఉండే అన్ని రకాల సదుపాయాలూ ఈ ఫాల్కన్ వాహనంలో ఉన్నాయి. అందుకే అర్హ మేకప్ నుంచి, ఆమె అన్ని రకాల అవసరాలనూ ఈ వాహనం నుంచే అందిస్తున్నారు. ఈ కారవాన్‌లోనే అర్హ సౌకర్యంగా ప్రయాణిస్తోంది. శాకుంతలం సెట్స్ మీద 'AA' అనే అక్షరాలున్న ఫాల్కన్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తోందని యూనిట్ మెంబర్స్ అంటున్నారు. డైరెక్టర్ గుణశేఖర్‌కు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా అర్హ నటిస్తోందనీ, ఆమె నటన సెట్స్ మీదున్న అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోందనీ అంటున్నారు.
మరో వైపు అర్జున్ సైతం 'పుష్ప' షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. అయినప్పటికీ ఫాల్కన్‌ను కూతురి కోసం పంపిస్తూ, తను వేరే కారవాన్‌ను ఉపయోగిస్తున్నాడు.

![]() |
![]() |