![]() |
![]() |

సమంత అక్కినేని ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'శాకుంతలం'. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ నటిస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్ శాకుంతలం సెట్స్ లో సందడి చేశారు.
సమంత టైటిల్ రోల్ పోషిస్తోన్న 'శాకుంతలం'లో.. మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నాడు. ప్రిన్స్ భరత పాత్రలో అల్లు అర్హ నటిస్తోంది. ప్రస్తుతం శకుంతల, దుష్యంత, భరత పాత్రల కాంబినేషన్ లోని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఈ సినిమా షూటింగు జరుగుతున్న లొకేషన్ కి వచ్చారు. సెట్స్ లో దేవ్ మోహన్ తో కలిసి అల్లు అర్జున్ దిగినటువంటి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అల్లు అర్జున్ ను కలవడం పై దేవ్ మోహన్ సంతోషం వ్యక్తం చేశారు.
అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'పుష్ప' అనే మూవీలో నటిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం క్రిస్మస్ కానుకగా ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల కానుంది.
![]() |
![]() |