క్యారెక్టర్ ఆర్టిస్ట్ రజిత ప్రాణాలను రియల్ స్టార్‌గా పేరుపొందిన శ్రీహరి కాపాడారు. షూటింగ్ సందర్భంగా స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయిన ఆమెను ఎవరూ పట్టించుకోకుండా వెళ్లిపోతే, ఆమెను గమనించిన శ్రీహరి స్విమ్మింగ్ పూల్‌లో దూకి, ఆమెను రక్షించారు. ఈ ఘటనను నటి రజిత స్వయంగా వెల్లడించారు. 'ఆలీతో సరదాగా' షోలో నటి సురేఖా వాణితో కలిసి పాల్గొన్న ఆమె 'బొబ్బిలి దొర' సినిమా సెట్స్‌పై జరిగిన ఆ ఘటనను గుర్తు చేసుకున్నారు.
"కృష్ణగారు హీరోగా నటించిన 'బొబ్బిలి దొర' షూటింగ్ జరుగుతోంది. సంఘవి హీరోయిన్. అందులో కాలేజీలో నన్ను సంఘవి ర్యాగింగ్ చేసే సీన్ ఒకటుంది. నేను పరికిణీ, వోణీ వేసుకొని కాలేజీకి వస్తే సంఘవి ర్యాగింగ్ చేస్తుంది. తను నా వోణీని లాగేసి, స్విమ్మింగ్ పూల్‌లోకి తోసేయాలి.. అదీ సీన్. అప్పుడింకా నాకు స్విమ్మింగ్ రాదు. 'వద్దు సార్.. నాకు స్విమ్మింగ్ రాదు.' అని డైరెక్టర్‌కు చెప్పాను. 'లేదు లేదు. మీరు స్విమ్మింగ్ పూల్‌లోకి జంప్ చేయగానే మనవాళ్లు వచ్చి తీస్తారు.' అనన్నారు. షాట్ అయిపోయింది. నన్ను స్విమ్మింగ్ పూల్‌లోనే వదిలేసి, వాళ్లంతా వేరే షాట్‌కు వెళ్లిపోయారు." అని గుర్తు చేసుకున్నారు రజిత.
ఇక ఆ రోజుతో తనకు నూకలు చెల్లిపోయాయని ఆమె అనుకున్నారు. "ఇదే నాకు లాస్ట్.. నా లైఫ్ అయిపోయింది.. ఈ స్విమ్మింగ్ పూల్తో నేను ఔట్.. అని రకరకాలుగా అనుకుంటున్నాను. వాటర్ తాగేస్తున్నాను. అక్కడ శ్రీహరిగారు కూర్చొని ఉన్నారు. ఆయనకు షాట్ లేదు. ఆయన నా విషయం అబ్జర్వ్ చేశారు. ఆయన మంచి స్ట్రాంగ్ పర్సనాలిటీ కదా.. వెంటనే జంప్‌చేసి, రెండు చేతుల్లో ఒక్కసారిగా నన్ను పైకి ఎత్తేశారు. అట్లా.. ఆయన నన్ను కాపాడారు." అని అప్పటి సంగతి గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు రజిత. నిజంగా ఆ ఘటనతో మరోసారి తాను రియల్ స్టార్‌నని శ్రీహరి నిరూపించుకున్నారు.