![]() |
![]() |

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఉద్దీపన కలిగించడంలో భాగంగా ఎగ్జిబిటర్లకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలియజేశారు. "సినిమా రీస్టార్ట్ ప్యాకేజీలో భాగంగా ఎగ్జిబిటర్స్‌ను ఆదుకునేందుకు కనికరంతో ముందుకు వచ్చిన జగన్మోహన్ రెడ్డిగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థియేటర్ల మనుగడ కోసం ఈ విధమైన ఉపశమన చర్యలు అవసరం. దీని వల్ల మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి, దానిమీద ఆధారపడి జీవనం సాగిస్తున్న వేలాది కుటుంబాలకు గొప్ప ప్రయోజనం చేకూరుతుంది." అని చిరంజీవి ట్వీట్ చేశారు.
కరోనా వల్ల దెబ్బతిన్న పరిశ్రమల పునరుద్ధరణలో భాగంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి అండగా నిలిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. సినిమా థియేటర్లు చెల్లించాల్సిన మూడు నెలల నిర్ణీత విద్యుత్తు ఛార్జీలను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మిగిలిన ఆరు నెలల విద్యుత్తు బకాయిలను వాయిదా పద్ధతిలో చెల్లించే అవకాశం కల్పించింది. అలాగే థియేటర్లకు రుణాలు, మారటోరియం విషయంలోనూ ఏపీ ప్రభుత్వం పలు వరాలు ప్రకటించడం గమనార్హం.

![]() |
![]() |