Home  »  News  »  Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి  నిరాశేనా!.. అంచనాలు తారుమారు

Updated : May 25, 2026

 

 

ఉస్తాద్ భగత్ సింగ్ తో తన కట్ అవుట్ కి ఉన్న ఛరిష్మాని పవన్(Pawan Kalyan)మరోసారి చాటి చెప్పాడు. డిజాస్టర్ టాక్ ని తెచ్చుకున్నా వరల్డ్ వైడ్ గా  95 .86 కోట్ల గ్రాస్ ని అందుకోవడమే అందుకు ఉదాహరణ. ఇక ప్రతి ఏటా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వచ్చిందంటే చాలు, అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా ట్రెండ్స్ నుండి థియేటర్ల సెలబ్రేషన్స్ వరకు ప్రతి ఒక్కటి ఎంతో గ్రాండ్‌గా ప్లాన్ చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోల పుట్టినరోజుల సందర్భంగా వారి పాత బ్లాక్‌బస్టర్ సినిమాలని  రీ రిలీజ్ చేయడం ఒక ట్రెండ్‌గా మారింది. కొత్త సినిమాలకి  ఏమాత్రం తీసిపోని రేంజ్‌లో ఈ రీ రిలీజ్ చిత్రాలకి  భారీ ఎత్తున వసూళ్లు కూడా వస్తున్నాయి. 


ఈ ఏడాది కూడా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఏ సినిమా రీ రిలీజ్ కానుందనే ఆసక్తి అభిమానుల్లో చాలా కాలంగా నెలకొంది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. వాటిలో ఏ చిత్రాన్ని ఈసారి వెండితెరపై ప్రదర్శిస్తారా అని ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూశారు. గత కొంతకాలంగా ఇండస్ట్రీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో 'బద్రి' మూవీని  పవన్ బర్త్‌డే సందర్భంగా రీ రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'బద్రి' సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్. సాంగ్స్, డైలాగ్స్ ,పవన్ మేనరిజమ్స్ ఇప్పటికీ అభిమానులకు పూనకాలు తెప్పిస్తాయి. దీంతో ఈ వార్త విన్న అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అయ్యారు. 

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అభిమానుల అంచనాలు పూర్తిగా తారుమారయ్యాయి. ఈసారి పవన్ బర్త్‌డే స్పెషల్‌గా 'బద్రి'  కాకుండా 'పంజా' ని  రీ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త బయటకు రావడంతో చాలా మంది పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర నిరాశకి గురవుతున్నారు. 'పంజా' లో  పవన్ లుక్స్, స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పరంగా అద్భుతంగా ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. ఓవరాల్‌గా క్లాసిక్ హిట్ అయిన 'బద్రి'తో పోలిస్తే అంత పెద్ద స్థాయిలో ఆకట్టుకోలేదని కొంత మంది ఫ్యాన్స్  భావిస్తున్నారు. దాంతో చాలా మంది పవన్ అభిమానులు 'బద్రి' నే రీ రిలీజ్ చెయ్యాలని అభిప్రాయపడుతున్నారు.


Also read: Bandla Ganesh: బండ్ల గణేష్‌ని చెప్పుతో కొట్టిన టాలీవుడ్ ప్రముఖుడు.. ఫ్యాన్స్ షాక్ 

మరోవైపు, ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న అభిమానులు కూడా లేకపోలేదు. 'పంజా' సినిమాలో పవన్ కళ్యాణ్ స్టైలింగ్, గడ్డం లుక్ మరియు గన్‌ఫైట్ సీన్స్ టాలీవుడ్‌లోనే బెస్ట్ అని వారు గుర్తు చేస్తున్నారు. అప్పట్లో ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ కాకపోయినప్పటికీ, ఇప్పటి ట్రెండ్‌కు పక్కాగా సెట్ అవుతుందని కొందరు గట్టిగా నమ్ముతున్నారు. 4K క్వాలిటీ మరియు అప్‌గ్రేడెడ్ సౌండ్ సిస్టమ్‌తో ఈ సినిమా కూడా రీ రిలీజ్‌లో అభిమానులను అదిరిపోయే రేంజ్‌లో అలరిస్తుందని, థియేటర్లలో మాస్ జాతర ఖాయమని మరికొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ 'బద్రి' సినిమా వస్తుందని ఆశించిన మెజారిటీ ఫ్యాన్స్‌కు మాత్రం ఈ వార్త కాస్త మింగుడుపడటం లేదు. పవన్ బర్త్  డే సెప్టెంబర్ 2 అనే విషయం తెలిసిందే. రీ రిలీజ్ కట్ అవుట్ పవన్ ది కాబట్టి ఇప్పట్నుంచే ఫ్యాన్స్ హంగామా.

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.