Home  »  News  »  Soul of Sahaa: మలయాళీ స్టైల్‌లో ప్యూర్ లవ్ స్టోరీ.. టాలీవుడ్‌ను కదిలిస్తున్న 'సోల్ ఆఫ్ సహ'!

Updated : May 25, 2026

టాలీవుడ్ లో యాక్షన్ సినిమాల హడావుడి ఎంత ఉన్నప్పటికీ, ఒక స్వచ్ఛమైన ప్రేమకథ థియేటర్లలోకి వస్తే ఆ మజానే వేరుగా ఉంటుంది. క్లాసిక్ లవ్ స్టోరీస్ కోసం ఆరాటపడుతున్న టాలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి, పాత జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేయడానికి ఒక సరికొత్త రొమాంటిక్ డ్రామా సిద్ధమవుతోంది. అదే 'సహ - లైఫ్ ఆఫ్ సంజు'.  (Sahaa Life of Sanju)

నూతన దర్శకుడు నిశాంత్ డోటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా కుమార్ కాసారం, శ్వేతా లక్ష్మణ్, వ్రజన పాండ్య హీరో హీరోయిన్లుగా వెండితెరకు పరిచయమవుతున్నారు. సుమైరా స్టూడియోస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

తాజాగా ఈ చిత్రం నుండి విడుదలైన 'సోల్ ఆఫ్ సహ' గ్లింప్స్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ గ్లింప్స్, ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకునేలా సాగింది. కేవలం రెండు నిమిషాల్లోనే ఒక అందమైన భావోద్వేగాల ప్రపంచాన్ని దర్శకుడు ఆవిష్కరించారు. ఈ గ్లింప్స్‌లో చూపించిన విజువల్స్ చూస్తుంటే, ఒక మలయాళ సినిమా చూస్తున్నంత సహజత్వం, ఇంటెన్సిటీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక స్వచ్ఛమైన ప్రేమకథకు ఎలాంటి హంగులు ఉండాలో అవన్నీ ఇందులో సమపాళ్లలో కుదిరాయి. కేవలం లవ్ ట్రాక్ మాత్రమే కాకుండా, మధ్యమధ్యలో వచ్చే ఫ్యామిలీ ఎమోషన్స్, చాలా సున్నితంగా నవ్వించే కామెడీ ఎలిమెంట్స్ ఈ రెండు నిమిషాల వీడియోలో అద్భుతంగా బ్లెండ్ అయ్యాయి.

ఈ గ్లింప్స్ ఇంత అందంగా, మనసుకు దగ్గరగా అనిపించడానికి ప్రధాన కారణం సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అని చెప్పాలి. ఆయన సమకూర్చిన మెలోడియస్ మ్యూజిక్ ప్రతి ఫ్రేమ్‌ను ఎలివేట్ చేసింది. 

ప్రేమలో ఉండే మధురానుభూతి, ఆ తర్వాత వచ్చే ఎడబాటు, జ్ఞాపకాలు, గుండెను పిండేసే నొప్పి, మళ్లీ చిగురించే ఆశ.. ఇలా ఒక మనిషి జీవితంలో ఉండే అన్ని రకాల ఎమోషనల్ జర్నీని ఈ గ్లింప్స్ ద్వారా చాలా డీటెయిల్‌డ్‌గా చూపించారు.

ఈ చిత్రం చాలా సింపుల్‌గా, బ్యూటిఫుల్‌గా ఉంటూ ప్రేక్షకులకు ఒక సరికొత్త రిఫ్రెషింగ్ ఫీల్‌ను ఇవ్వబోతోందని గ్లింప్స్ చుస్తే అర్థమవుతోంది. టాలీవుడ్‌లో చాలా కాలం తర్వాత ఒక ప్యూర్ లవ్ స్టోరీ రాబోతుందనే నమ్మకాన్ని ఈ వీడియో కల్పించింది.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.