![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు, టాలీవుడ్ యాక్షన్ సినిమా ప్రేమికులకు 'OG' మూవీ ఎంతటి భారీ మేనియాను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా బాక్సాఫీస్ వద్ద విజృంభించడమే కాకుండా, పవన్ కళ్యాణ్‌ను మునుపెన్నడూ చూడని స్టైలిష్ అవతార్‌లో ఆవిష్కరించింది.
ఇప్పుడు అదే పవర్ ఫుల్ కాంబినేషన్‌లో వస్తున్న సీక్వెల్ 'OG 2' కి సంబంధించి నెట్టింట ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది. ప్రస్తుతం 'OG 2' టీమ్ అధికారికంగా ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించిందని, డైరెక్టర్ సుజీత్ ఈ రెండవ భాగానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్, ప్రీ విజ్యులైజేషన్ ప్రక్రియపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారని సమాచారం. మొదటి భాగాన్ని మించిన హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఈ సీక్వెల్‌ను రూపుదిద్దేందుకు సుజీత్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకుల పుట్టినరోజుల సందర్భంగా ఏదో ఒక ప్రత్యేక పోస్టర్ లేదా ప్రమోషనల్ కంటెంట్ విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే రాబోయే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఒక మైండ్ బ్లోయింగ్ సర్ ప్రైజ్ అందించేందుకు మేకర్స్ పక్కా ప్లాన్ రూపొందిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా 'OG 2' నుంచి ఒక అద్భుతమైన యానిమేషన్ వీడియోను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ యానిమేటెడ్ ప్రెజెంటేషన్ ను అద్భుతంగా, హై విజువల్ స్టాండర్డ్స్‌తో తీర్చిదిద్దేందుకు గాను చెన్నైకి చెందిన ప్రముఖ యానిమేషన్ స్టూడియోలో పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలుస్తోంది.
కేవలం ఒక సాధారణ ప్రకటనగా మాత్రమే కాకుండా, ఒక అనౌన్స్‌మెంట్ టీజర్ శైలిలో ఈ వీడియో డిజైన్ అవుతోందని వినికిడి. ఈ యానిమేటెడ్ టీజర్ ద్వారా 'OG 2' కథా ప్రపంచం, అందులోని ప్రధాన పాత్రల స్వభావం, సీక్వెల్లో ఉండబోయే హై-వోల్టేజ్ గ్యాంగ్‌స్టర్ ఎలిమెంట్స్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వివరాలను అభిమానులకు ముందే రుచి చూపించనున్నారట.
దర్శకుడు సుజీత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేస్తున్న ఈ యానిమేటెడ్ వీడియో పవన్ కళ్యాణ్ అభిమానులకు రాబోయే సెప్టెంబర్ 2న పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను పవన్ కళ్యాణ్ స్వయంగా నిర్మిస్తుండటం విశేషం. అంతేకాకుండా తన మార్క్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఆల్బమ్‌తో ఆకట్టుకుంటున్న మ్యూజిక్ సెన్సేషన్ తమన్ మరోసారి తన పవర్ ఫుల్ మ్యూజిక్ తో బీభత్సం సృష్టించడానికి సిద్ధమవుతున్నారు.
Pawan Kalyan, Birthday, OG 2 Animated Video, Sujeeth, OG2 Movie
![]() |
![]() |