Home  »  News  »  రోడ్డు ప్రమాదంలో ప్రముఖ బాలనటి మృతి.. కోట్లాది మంది హృదయాల్ని గెలుచుకుంది

Updated : Jul 22, 2026

 

-షాక్ కి గురవుతున్న ప్రపంచ సినీ ప్రేమికులు 
-కారు యాక్సిడెంట్ లో బాల నటి మృతి 
-యాక్సిడెంట్ కి గల కారణమేంటి!


 సినీ ప్రపంచంలోకి చిన్నారి తారగా అడుగుపెట్టి, తన అద్భుతమైన అభినయంతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలని గెలుచుకున్న యువ నటి కైలీ హాటిల్ (Kaylee Hottle) నిన్న అమెరికాలోని మేరీ ల్యాండ్ లో జరిగిన రోడ్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. దీంతో  ప్రపంచ సినిమాలు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.

స్థానిక పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం తెల్లవారుజామున సుమారు 2:52 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. కైలీ తో పాటు మరో యువకుడు  1995 మోడల్ కి చెందిన హోండా కార్డ్‌ కారులో వెళ్తున్నారు. మితిమీరిన వేగంతో వస్తున్న కారు వేగంగా రోడ్ పక్కనే ఉన్న కల్వర్టుని బలంగా ఢీకొట్టింది.ప్రమాదం జరిగిన వెంటనే కైలీ, యువకుడ్ని  చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. కానీ తీవ్ర గాయాల కారణంగా కైలీ చనిపోగా కారులో ఉన్న మరో వ్యక్తి  ప్రమాదం నుండి తృటిలో ప్రాణాలతో బయట పడ్డాడు. డ్రైవర్ స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.


Also read: మెగా హీరో మూవీపై కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ ప్రాజెక్ట్ నాదే 

2021లో వచ్చిన హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ చిత్రం 'గాడ్జిల్లా వర్సెస్ కాంగ్' లో 'జియా' (Jia) అనే మూగ, చెవిటి పాప క్యారక్టర్ లో  కైలీ ప్రదర్శించిన నటన అందరినీ కట్టిపడేసింది. మాటలు లేకపోయినా సైగలతో కళ్లలోని భావాలతో భారీ రాక్షస జంతువు 'కాంగ్' తో ఆమె పెంచుకునే అనుబంధం ప్రేక్షకులని భావోద్వేగానికి గురిచేసింది.  2024లో విడుదలైన 'గాడ్జిల్లా vs  కాంగ్ సీక్వెల్‌లో కూడా నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. కైలీ మరణవార్తని  ఆమె తండ్రి జోషువా హాటిల్  ఫేస్‌బుక్‌లో సైన్ లాంగ్వేజ్‌లో ఒక కన్నీటి వీడియో రూపంలో పంచుకోవడంతో ప్రపంచానికి ఈ చేదు నిజం తెలిసింది. కైలీ పుట్టుకతోనే వినికిడి లోపంతో  జన్మించింది..కైలీ మృతి పట్ల ప్రపంచ సినీ ప్రేమికులతో పాటు సినీ బృందం తన సంతాపాన్ని తెలియచేస్తుంది. కైలీ వయసు ప్రస్తుతం పద్దెమిది సంవత్సరాలు.

kaylee hottle, Godzilla vs Kong actor


  
 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.