Home  »  News  »  మెగా హీరో మూవీపై కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆ ప్రాజెక్ట్ నాదే 

Updated : Jul 22, 2026

 


కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram)ఈ శుక్రవారం అంటే 24 న చెన్నై లవ్ స్టోరీతో థియేటర్స్ లో అడుగుపెడుతున్నాడు. ప్రచార చిత్రాలు బాగుండటం, క్రేజీ భామ గౌరీ ప్రియ హీరోయిన్ కావడం, మెగా కాంపౌండ్ గా పిలుచుకునే ఎస్ కె ఎన్, సాయి రాజేష్ నిర్మాతలు కావడంతో  చెన్నై లవ్ స్టోరీ పై మంచి అంచనాలే ఉన్నాయి. 

ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా 'కిరణ్ అబ్బవరం' సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్(Sai Durga Tej)అప్ కమింగ్ మూవీ 'సంబరాల ఏటిగట్టు' పై కీలక వ్యాఖ్యలు చేసాడు. 'సంబరాల ఏటిగట్టు" సినిమా నిజానికి సాయి తేజ్ కంటే ముందు నా దగ్గరకే వచ్చింది. 2021 లో దర్శకుడు రోహిత్ 2 కోట్ల చిన్న బడ్జెట్ కథతో నా వద్దకి వచ్చాడు..అయితే రోహిత్‌లోని అద్భుతమైన ప్రతిభ తెలిసి, చిన్న కథ కాకుండా ఒక పెద్ద స్కేల్ ఉన్న కథని సిద్ధం చేయమని సూచించాను. అలా రూపుదిద్దుకున్నదే ఈ "సంబరాల ఏటిగట్టు" కథ.

నాకు ఎంతో ఆప్తుడైన 'హనుమాన్' చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డికి రోహిత్ ని పరిచయం చేశాను.కానీ ప్రీ ప్రొడక్షన్ ప్రక్రియ సాగుతుండగానే పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఒకవైపు కథ పరిధి పెరిగిపోవడంతో బడ్జెట్ అనుకున్న దానికంటే భారీగా పెరిగి  60 కోట్ల నుండి 70 కోట్లకి చేరుకుంది. మరొకవైపు అదే సమయంలో నా నుంచి వచ్చిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుసగా ఫ్లాప్ అయ్యాయి. మార్కెట్‌లో తన స్థానం కొంత ఊగిసలాటలో ఉన్న ఆ సమయంలో, అంత పెద్ద బడ్జెట్ నా మార్కెట్ మీద పెట్టడం రిస్క్ అని ఆలోచించాను.

నిర్మాత నిరంజన్ రెడ్డి తనతోనే సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, నిర్మాత క్షేమం కోరి స్వయంగా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను.సంబరాల యేటిగట్టు  అతిపెద్ద హిట్ కావాలని మొదట ఆశించేది, సంతోషించేది నేనేనని కిరణ్ చెప్పుకొచ్చాడు. సాయి దుర్గ తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా చేస్తుండగా పాన్ ఇండియా లెవల్లో సంబరాల యేటి గట్టు తెరకెక్కుతుంది.

kiran abbavaram, saidharam tej, syg, sambarala yetigattu


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.