Home  »  News  »  నేషనల్ అవార్డు రాగానే ఆ మూవీ కోసం నెటిజన్స్ వెతుకులాట..ఎంతైనా ప్రేక్షకులు కదా!

Updated : Jul 20, 2026


ప్రస్తుత రోజుల్లో ఏ సినిమా హిట్ అవుతుందో, ఫట్ అంటుందో చెప్పడం కష్టమైంది. అంతే కాదు ఒక్కోసారి బాగున్న సినిమాలు ప్రేక్షకులకి అంతగా కనెక్ట్ కాలేకపోతున్నాయి. ఈ విషయంలో ప్రేక్షకులది పొరపాటు ఉందా? లేక మేకర్స్ సరిగా పబ్లిసిటీ చేయలేదా? అనే డౌట్ వస్తుంది. ఏమైనా కేంద్ర ప్రభుత్వం  మొన్న రిలీజ్ చేసిన 2024 కి సంబంధించిన నేషనల్ అవార్డ్స్  మూవీ లవర్స్ కి సరికొత్త పనిని కల్పించింది.

 బాలీవుడ్ లో ప్రముఖ హీరో కార్తీక్ ఆర్యన్ నుంచి వచ్చిన చిత్రం 'చందు ఛాంపియన్’  అగ్ర దర్శకుడు కబీర్ ఖాన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కగా థియేటర్లలో యావరేజ్ టాక్‌ రావడంతో  భారీ వసూళ్లని సాధించలేకపోయింది. కార్తీక్ ఆర్యన్ నటనకి మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. అయితే తాజాగా ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర అవార్డులలో (72nd National Film Awards)  చందు ఛాంపియన్ సంచలనం సృష్టించింది. ఎవరూ ఊహించని విధంగా  కార్తీక్ ఆర్యన్  ఉత్తమ నటుడు (Best Actor) జాతీయ అవార్డుని  దక్కించుకున్నాడు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టితో (భ్రమయుగం చిత్రానికి గానూ) కలిసి ఆయన ఈ పురస్కారాన్ని పంచుకోవడం విశేషం.  

దీంతో థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీ వేదికల్లో 'చందు ఛాంపియన్' చిత్రాన్ని ఎగబడి చూస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. మూవీ కథ విషయానికి వస్తే భారతదేశపు మొట్టమొదటి పారాలింపిక్ స్వర్ణ పతక విజేత మురళీకాంత్ పేట్కర్ జీవిత ఆధారంగా రూపొందింది. దేశం కోసం యుద్ధంలో పోరాడి, శరీరంలో 9 బుల్లెట్లు దిగబడినా గుండె ధైర్యంతో ఈత కొలనులో దూకి దేశానికి ఒలింపిక్ బంగారు పతకాన్ని అందించిన ఒక యోధుడి కథ ఇది. ఈ క్యారక్టర్ లో నటించడానికి  కార్తీక్ ఆర్యన్ పడిన కష్టం సామాన్యమైనది కాదు. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన కార్తీక్, తన కెరీర్‌లోనే అత్యంత కష్టతరమైన రోల్ ని ఈ సినిమా కోసం ఎంచుకున్నాడు. దాదాపు 14 నుండి 15 నెలల పాటు . బాక్సింగ్, స్విమ్మింగ్,  అథ్లెటిక్స్ నేర్చుకోవడమే కాకుండా, తన శరీర బరువుని ఏకంగా 90 కిలోల నుండి 72 కిలోల వరకు తగ్గించుకున్నాడు. శరీరంలో ఫ్యాట్ శాతాన్ని కేవలం 7 శాతానికి పరిమితం చేసి నిజమైన అథ్లెట్‌గా మారిపోయాడు. థియేటర్లలో ఈ సినిమా కేవలం 75 కోట్ల నుండి 80 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే సాధించి యావరేజ్ చిత్రంగా నిలిచింది. కానీ, జాతీయ స్థాయిలో మాత్రం అత్యున్నత పురస్కారాన్ని గెలుచుకుని కంటెంట్ ఉన్న సినిమా ఎప్పటికీ ఓడిపోదని నిరూపించింది. 


also read: దేశద్రోహి ఎవరు? నరేష్ సంచలన వ్యాఖ్యలు 


15 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో కార్తీక్ ఆర్యన్ అందుకున్న మొట్టమొదటి జాతీయ అవార్డు ఇది కావడంతో ఆయన అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. నటుడిగా కార్తీక్ కష్టానికి దక్కిన ప్రతిఫలం ఇదని బాలీవుడ్ వర్గాలు కొనియాడుతున్నాయి.ఛాంపియన్ పడిపోతాడు కానీ ఎప్పటికీ ఆగడు” అనే ఈ సినిమా డైలాగ్ కార్తీక్ ఆర్యన్ రియల్ లైఫ్ కెరీర్‌కు సరిగ్గా సరిపోతుందని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. 


Kartik Aaryan, chandu champion, kabir khan






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.