Home

»

Latest News

దేశద్రోహి ఎవరు? నరేష్ సంచలన వ్యాఖ్యలు 

Jul 20, 2026 4:38PM


ప్రముఖ హీరో, నటుడు నరేష్(Naresh)కి, పరిశమ్రకి మధ్య ఉన్న అనుబంధానికి  ఇప్పట్లో ఎండ్ కార్డు పడే అవకాశం లేదు. ఐదున్నర దశాబ్దాల క్రితమే బాలనటుడుగా సినీ రంగ ప్రవేశం చేసి నేటికీ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. యంగ్ డైరెక్టర్స్ సైతం నరేష్ కోసమే క్యారెక్టర్స్ రాస్తారంటే ఆయన నటనకి ఉన్న చరిష్మాని అర్ధం చేసుకోవచ్చు.


దేశంలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం వేగంగా అందుబాటులోకి తెస్తున్న ఇథనాల్ కలిపిన ఈ20 (E20) పెట్రోల్‌పై  నరేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతు 'ఈ కొత్త ఇంధనం వల్ల సామాన్యుల బైక్‌ల నుంచి కోట్ల విలువైన లగ్జరీ కార్ల వరకు వాహనదారులందరికీ గుండెపోటు వచ్చేలా ఉంది. నేను పర్యావరణానికి గానీ, దేశానికి గానీ వ్యతిరేకిని కాదు. అయితే ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకుండా ఇంత వేగంగా ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్‌ దేశవ్యాప్తంగా రుద్దడం వల్ల కోట్లాది మంది ఇబ్బందులు పడుతున్నారు. నా మిత్రుడు ఇటీవల సరికొత్త టయోటా కామ్రీ కారు  కొనుగోలు చేశాడు. అయితే అందులో ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని వాడటం వల్ల కేవలం కొద్ది రోజులకే ఆ కారు ఇంజిన్ వాల్వ్‌లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ వాల్వ్‌ల మార్పిడి, రిపేర్ల కోసమే  3.5 లక్షలు ఖర్చయింది. ఒకవేళ ఇదే సమస్య నా  కోటిన్నర రూపాయల విలువైన కొత్త పోర్షే పనామెరా కారుకి గనుక వస్తే, ఆ ఇంజిన్ రిపేర్ ఖర్చు ఏకంగా  12 లక్షల వరకు ఉంటుంది. ఈ భారీ నష్టాన్ని నివారించేందుకు, కారు ఇంజిన్‌ కాపాడుకునేందుకు ప్రస్తుతం లీటరు . 165 చెల్లించి హై-ఆక్టేన్ 100 పెట్రోల్‌  మాత్రమే వాడుతున్నాను. అయితే, ఈ సమస్య కేవలం లగ్జరీ కార్ల యజమానులది మాత్రమే కాదు. సాధారణ బైక్ వినియోగదారులు మరియు మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఏమిటి. హైవేలపై ప్రయాణించేటప్పుడు ఇటువంటి ప్రీమియం హై-ఆక్టేన్ పెట్రోల్ అసలు దొరకదు. సామాన్యులు అంత ధర పెట్టి ఇంధనాన్ని కొనలేరు.


also read: లెనిన్ పది రోజుల కలెక్షన్స్ ఇవే.. వాళ్ళకి మాత్రం మైండ్ బ్లాక్!

అలాగే లక్షల రూపాయల రిపేర్ ఖర్చులని భరించలేరు. బ్రెజిల్ వంటి చిన్న దేశాలు ఇథనాల్ ఇంధన విధానాన్ని దశలవారీగా, చాలా నెమ్మదిగా అమలు చేసి విజయం సాధించాయని, భారతదేశంలో ఇంత తొందరపాటు ఎందుకని  కేంద్రాన్ని ప్రశ్నించారు.  గతంలో బీజేపీలో క్రియాశీలకంగా పనిచేసిన నరేష్, రాజకీయంగా కూడా ఈ అంశంపై హెచ్చరికలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వంగా ఏర్పడిన ప్రస్తుత తరుణంలో, రాబోయే సార్వత్రిక ఎన్నికలకు కేవలం రెండేళ్ల సమయం మాత్రమే ఉందని, ఈ తరహా తొందరపాటు నిర్ణయాలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని నింపి ప్రభుత్వానికి రెడ్ సిగ్నల్‌గా మారుతాయని అభిప్రాయపడ్డారు.

naresh, central government, modi

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com