Home  »  News  »  అపరిచితుడు తెలుసుగా: రెండేళ్లు విషపూరితమైన వ్యక్తితో గడిపా..అనుపమ సంచలన వ్యాఖ్యలు 

Updated : Aug 13, 2026

 


తెలుగు నాట షార్ట్ పీరియడ్ లో క్రేజీ భామగా మారింది అనుపమ పరమేశ్వరన్. రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు ;దాదాపు రెండు సంవత్సరాల  పాటు ఒక అత్యంత విషపూరితమైన 'టాక్సిక్ రిలేషన్‌షిప్' లో తీవ్ర నరకాన్ని అనుభవించాను. ఆ బంధంలో ఉన్నంత కాలం ప్రతి నిమిషం భయంతో, ఆందోళనతో, అభద్రతా భావంతో గడిపాను. బయటకు నవ్వుతూ కనిపించినా, లోపల శారీరకంగా, మానసికంగా పూర్తిగా నలిగిపోయాను .  నా మాజీ భాగస్వామి ప్రవర్తన 'అపరిచితుడు' సినిమాలోలా ఉండేది. ఒక రోజు 'రెమో'లాగా ఎంతో భయంకరమైన ప్రేమను కురిపిస్తూ, తనకంటే అదృష్టవంతురాలు ఎవరూ లేరనే భ్రమను కలిగిస్తాడు. కానీ మరుసటి రోజే అతడిలో 'అపరిచితుడు' బయటకు వచ్చి అత్యంత క్రూరంగా ప్రవర్తించేవాడు. ఎవరైనా వచ్చి నన్ను కత్తితో పొడిచినా పట్టించుకోని విధంగా ఉంటాడు. ఆ మరుసటి రోజే వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ, చిన్న పిల్లాడిలా ఏడుస్తూ క్షమాపణలు కోరేవాడు. ప్రతిసారీ అతడి మాటలు నమ్మి క్షమించడం, మళ్లీ అదే నరకం రిపీట్ కావడం ఒక అలవాటుగా మారిపోయింది. కేవలం 3 నెలల డేటింగ్ సమయంలోనే తన ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులకి  పరిచయం చేశాడు.

ఆ వెంటనే నిశ్చితార్థం కోసం ఒత్తిడి తెచ్చాడు. ఒకవేళ నేను ఆ రోజు ధైర్యం చేసి నిశ్చితార్థాన్ని వాయిదా వేయకపోతే లేదా ఆపకపోయి ఉంటే, అతడిని పెళ్లి చేసుకుని, చివరికి విడాకులు తీసుకోవాల్సి వచ్చేది. ఈ 2 ఏళ్ల కాలంలో తన జీవితంలో స్వేచ్ఛ పూర్తిగా కోల్పోయానని, ప్రతి చిన్న పని చేయడానికి లేదా మాట్లాడే ముందు 'ఎదుటి వ్యక్తి ఎలా స్పందిస్తారో' అని వందసార్లు మనసులోనే ప్రాక్టీస్ చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ విషపూరిత బంధం ప్రభావం నా వృత్తిపరమైన కెరీర్‌పై కూడా తీవ్రంగా పడింది. ఆమె కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచిన 'డ్రాగన్' సినిమా ప్రమోషన్లకి కూడా  హాజరు కాలేకపోవడానికి ఆ మానసిక వేధనే కారణం. అతడి మితిమీరిన నియంత్రణ వల్ల ఎన్నో మంచి ప్రాజెక్టులు, అవకాశాలని  వదులుకోవాల్సి వచ్చిందని చెప్పారు.

Also read: సుప్రీంకోర్టు కీలక తీర్పు: #దిల్ రాజు సేఫ్ జోన్ లో ఉన్నట్టేనా! 

 

రోజురోజుకి  నా వ్యక్తిత్వం కుంచించుకుపోతూ వచ్చింది. కానీ ఆత్మహత్య బాట పట్టకుండా, నన్ను నేను కాపాడుకుని స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉన్నాను. నార్సిసిస్టిక్ అబ్యూజ్ అంటే ఏమిటో తెలియక, అలాంటి టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో చిక్కుకుని బయటకు రాలేకపోతున్న వేలాది మందికి అవగాహన కల్పించడానికే ఈ విషయాలు బయటకు చెప్తున్నానని అనుపమ స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ మాటలు వైరల్ గా మారాయి. అనుపమ గతంలో విక్రమ్ తనయుడు ప్రముఖ హీరో ధృవ్ విక్రమ్ తో  డేటింగ్ లో ఉందనే వ్యాఖ్యలు వినిపించిన విషయం తెలిసిందే.

Anupama Parameswaran, Tollywood






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.