![]() |
![]() |

జూనియర్ ఎన్టీఆర్ భుజం ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిన తర్వాత సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ఒక ఎమోషనల్ మెసేజ్ షేర్ చేశారు. తనకు సర్జరీ విజయవంతమైందని, ప్రస్తుతం క్షేమంగా ఉన్నానని వెల్లడించారు.
సికింద్రాబాద్ KIMS హాస్పిటల్స్ వైద్యుల బృందానికి ధన్యవాదాలు తెలపడంతో పాటు, తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు చూపిస్తున్న ప్రేమే తనకు కొండంత బలాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. "See you soon" అంటూ తారక్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇటీవల ఎన్టీఆర్ భుజానికి గాయమవ్వగా, నేడు కిమ్స్ హాస్పిటల్ లో సర్జరీ జరిగింది. సర్జరీ సక్సెస్ అయిందని, ఎన్టీఆర్ పూర్తిగా కోలుకోవడానికి రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందని హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కూడా సోషల్ మీడియా వేదికగా తన హెల్త్ అప్డేట్ ఇచ్చారు. "మీ అందరి అపారమైన ప్రేమ, ప్రార్థనలు నన్ను ఎంతో ఉద్వేగానికి గురిచేస్తున్నాయి. సర్జరీ విజయవంతంగా పూర్తయింది, నేను ప్రస్తుతం చాలా బాగున్నాను" అని ట్వీట్ చేశారు.
https://x.com/tarak9999/status/2087524661877932480
Jr NTR Surgery, KIMS Hospital, NTR Tweet
![]() |
![]() |