![]() |
![]() |
.webp)
'మన శంకర వరప్రసాద్ గారు'తో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) బాక్సాఫీస్ వేట మొదలైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్, సంక్రాంతి కానుకగా తాజాగా థియేటర్లలో ఆడుగుపెట్టింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని.. భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. (Mana Shankara Vara Prasad Garu)
చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ కావడం, వెంకటేష్ ప్రత్యేక పాత్ర పోషించడంతో.. 'మన శంకర వరప్రసాద్ గారు'పై విడుదలకు ముందే మంచి హైప్ వచ్చింది. అందుకు తగ్గట్టుగానే అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరిగాయి.
అడ్వాన్స్ సేల్స్ ద్వారా ప్రీమియర్స్ తో కలిపి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.35 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టడం విశేషం. ఇక సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో.. తెలుగునాట ఈరోజు బుకింగ్స్ మరింత ఊపందుకున్నాయి. మరోవైపు నార్త్ అమెరికాలోనూ ఇప్పటికే 1.5 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరింది.
Also Read: మన శంకర వరప్రసాద్ గారు మూవీ రివ్యూ
'మన శంకర వరప్రసాద్ గారు' జోరు చూస్తుంటే.. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.50 కోట్ల గ్రాస్ వరకు రాబట్టే అవకాశముంది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే.. ఫస్ట్ డే రూ.70 కోట్ల గ్రాస్ వరకు రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
![]() |
![]() |