![]() |
![]() |

రాగ్ మయూర్ హీరోగా ‘డీజే టిల్లు’ ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ ‘అనుమాన పక్షి’. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హీరాచంద్ దండ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
‘అనుమాన పక్షి’ సెప్టెంబర్ 18న థియేటర్లలోకి రానుందని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల తేదీని తెలియజేస్తూ ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేశారు. సినిమా విభిన్నమైన టోన్‌తో పాటు హీరో విచిత్రమైన ఆలోచనా విధానాన్ని ఈ పోస్టర్ ప్రజెంట్ చేస్తోంది.
రాగ్ మయూర్ సంప్రదాయ దుస్తుల్లో చేతిలో రైఫిల్ పట్టుకుని కనిపిస్తున్నారు. ఆయన పక్కనే ఉన్న బ్లాక్‌బోర్డుపై “Doubts Under Investigation” అనే టైటిల్‌తో జీవితం, విధి, కర్మ సంబంధించిన ఆసక్తికరమైన ప్రశ్నలను పొందుపరిచారు. “One Boy. Billion Thoughts. Zero Chill.” అనే ట్యాగ్‌లైన్ ఆయన పాత్రలోని ఆలోచనా విధానాన్ని మరింత ఆసక్తికరంగా తెలియజేస్తోంది.

‘డీజే టిల్లు’తో తనదైన క్యారెక్టరైజేషన్, హ్యూమర్‌తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విమల్ కృష్ణ ‘అనుమాన పక్షి’తో మరో వైవిధ్యమైన కాన్సెప్ట్‌ను తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రంలో మెరిన్ ఫిలిప్ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రిన్స్ సెసిల్, రాశి, అనన్య, చరిత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా సునీల్ కుమార్ నామా, ఆర్ట్ డైరెక్టర్‌గా జేకే మూర్తి, ఎడిటర్‌గా అభినవ్ కునపరెడ్డి పని చేస్తున్నారు.
ఇప్పటికే టీజర్, విభిన్నమైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఆసక్తిని పెంచిన ఈ చిత్రం మరో మూడు వారాల్లో థియేటర్లలోకి రానుంది. మేకర్స్ ప్రమోషన్స్‌ను మరింత ముమ్మరం చేయనున్నారు.
[DJ Tillu Movie, Director Vimal Krishna, Anumana Pakshi Movie, Release Date, Rag Mayur, Telugu Comedy, Tollywood, Telugu Cinema, Telugu News]
![]() |
![]() |