![]() |
![]() |

'బాహుబలి' సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఆ తర్వాత 'సాహో', 'రాధేశ్యామ్' సినిమాలతో నిరాశపరిచాడు. ఈ క్రమంలో సాలిడ్ హిట్ తో బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చూపించాలి అనుకుంటున్న ప్రభాస్ ప్రస్తుతం 'ఆదిపురుష్', 'సలార్', 'ప్రాజెక్ట్ k' వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నాడు. ఇలా వరుస భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్న ప్రభాస్ అనూహ్యంగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పాడని టాక్. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి.
వరుస భారీ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. తక్కువ బడ్జెట్ మరియు తక్కువ రోజుల్లో షూట్ పూర్తవుతుందన్న కారణంగా మారుతి సినిమాకి ఓకే చెప్పినట్లు టాక్. పైగా ఈ హర్రర్ కామెడీ స్క్రిప్ట్ ప్రభాస్ కి నచ్చిందట. అందుకే ఎవరూ ఊహించని విధంగా ఈ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అయ్యాడట. పలు కారణాల చేత ఆలస్యమవుతూ వస్తున్న ఈ మూవీ ఆగష్టు చివరివారం లేదా సెప్టెంబర్ మొదటివారంలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ సినిమా మొదలైన ఆరు నెలలలోపే ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.
డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహన్ ఒక హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించనున్నాడట.
![]() |
![]() |