![]() |
![]() |

ఆ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ లో నటించిన `అజ్ఞాతవాసి`(2018)లో ఓ కథానాయికగా ఎంటర్టైన్ చేసింది కేరళకుట్టి కీర్తి సురేశ్. కట్ చేస్తే.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో నటిస్తున్న `భోళా శంకర్`లో చెల్లెలుగా యాక్ట్ చేస్తోంది.
ఇదిలా ఉంటే, త్వరలో ఈ ముద్దుగుమ్మ మరో మెగా ప్రాజెక్ట్ లోనూ భాగం కానుందట. ఆ వివరాల్లోకి వెళితే.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ఓ భారీ బడ్జెట్ మూవీని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని కథానాయికగా నటిస్తుండగా.. శ్రీకాంత్, అంజలి, జయరామ్, సునీల్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. కాగా, ఈ సినిమా తాలూకు ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఓ ఎపిసోడ్ లో కీర్తి సురేశ్ అతిథిగా మెరవనుందని సమాచారం. అదే గనుక నిజమైతే.. అటు శంకర్ కాంబినేషన్ లోనూ, చరణ్ కాంబోలోనూ కీర్తికి ఇదే మొదటి సినిమా అవుతుంది. త్వరలోనే `#RC 15`లో కీర్తి సురేశ్ ఎంట్రీపై క్లారిటీ రానున్నది.
కాగా, కీర్తి సురేశ్ తాజా చిత్రం `సర్కారు వారి పాట` రేపు (మే 12) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాని పరశురామ్ డైరెక్ట్ చేశాడు.
![]() |
![]() |