![]() |
![]() |

చాలా కాలం క్రితం `అన్నయ్య` (2000)లో మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడిగా ఆకట్టుకున్న మాస్ మహారాజా రవితేజ.. 22 ఏళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం మరోమారు ఆ తరహా పాత్రలో దర్శనమివ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. `మెగా 154` అనే వర్కింగ్ టైటిల్ తో బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో ఇలా చిరుకి తమ్ముడిగా కనిపించబోతున్నారట రవితేజ. అంతేకాదు.. తను పోషించే పాత్రలో మల్టిషేడ్స్ ఉంటాయట.
ఆ వివరాల్లోకి వెళితే.. మైత్రీ మూవీ మేకర్స్ బేనర్ లో చిరు - బాబీ కాంబినేషన్ లో రానున్న చిత్రం - ఓ కాప్ డ్రామా అని టాక్. ఇందులో మెగాస్టార్ ఓ అండర్ కవర్ కాప్ గా ఎంటర్టైన్ చేయనుండగా.. అతని తమ్ముడిగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో వినోదాలు పంచనున్నారట రవితేజ. అంతేకాదు.. చిరు తమ్ముడిగా, శక్తిమంతమైన పోలీస్ అధికారిగా, భర్తగా, ఓ బిడ్డకు తండ్రిగా.. ఇలా ఎన్నో షేడ్స్ ఈ పాత్రలో ఉంటాయని సమాచారం. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
కాగా, రవితేజ తాజా చిత్రం `రామారావు ఆన్ డ్యూటీ` జూన్ 17న రిలీజ్ కానుంది. ఇక ఇదే ఏడాది `ధమాకా`, `రావణాసుర` చిత్రాలు కూడా తెరపైకి రానున్నాయి. వీటితో పాటు పాన్ - ఇండియా మూవీ `టైగర్ నాగేశ్వర రావు` కూడా రవితేజ చేతిలో ఉంది.
![]() |
![]() |