![]() |
![]() |

నటిగా మంజు వారియర్ ది 27 ఏళ్ళ సినీ ప్రస్థానం. 1995లో విడుదలైన మలయాళ చిత్రం `సాక్ష్యం`తో తెరంగేట్రం చేసిన మంజు.. అనతి కాలంలోనే మంచి గుర్తింపుని తెచ్చుకుంది. అలాగే, `ఉత్తమ నటి`గా ఏకంగా ఏడు ఫిల్మ్ ఫేర్ అవార్డులని అందుకుని వార్తల్లో నిలిచింది. కాగా, మూడేళ్ళ క్రితం వరకు మాలీవుడ్ కే పరిమితమైన ఈ మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రస్.. ఆ మధ్య ధనుష్ నటించిన `అసురన్` (`నారప్ప` మాతృక)తో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తన అద్భుత అభినయంతో అలరించింది.
కట్ చేస్తే.. త్వరలో మంజు వారియర్ మరో తమిళ చిత్రంలో దర్శనమివ్వనుందని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.. `నేర్కొండ పార్వై`, `వలిమై` చిత్రాల తరువాత టాప్ స్టార్ అజిత్ - టాలెంటెడ్ డైరెక్టర్ హెచ్. వినోద్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో అజిత్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని.. అందులో ఒక పాత్ర నెగటివ్ రోల్ అని బజ్. కాగా.. విలన్ రోల్ కి జోడీగా మంజు వారియర్ నటించే అవకాశముందని టాక్. త్వరలోనే అజిత్ - వినోద్ థర్డ్ జాయింట్ వెంచర్ లో మంజు వారియర్ ఎంట్రీపై క్లారిటీ రానుంది. మరి.. అజిత్, మంజు వారియర్ జోడీ ఏ స్థాయిలో మెస్మరైజ్ చేస్తుందో చూడాలి.
![]() |
![]() |