నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్' షో ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. మొదటి సీజన్ లో అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి స్టార్స్ సందడి చేయగా.. ప్రస్తుతం ప్రసారమవుతున్న రెండో సీజన్ లో ప్రభాస్, పవన్ కళ్యాణ్ సందడి చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ సీజన్ చివరి ఎపిసోడ్ కి జూనియర్ ఎన్టీఆర్ రానున్నాడని ప్రచారం జరుగుతోంది.
'అన్ స్టాపబుల్' షోకి తారక్ ఎప్పుడొస్తాడా అని నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. బాబాయ్-అబ్బాయ్ సరదాగా మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో చూడాలని వాళ్ళు ఎంతో ఆశపడుతున్నారు. అయితే వారి ఆశ ఈ సీజన్ లోనే నెరవేరనుందని తెలుస్తోంది. ఈ సీజన్ చివరి ఎపిసోడ్ లో తారక్ పాల్గొనబోతున్నట్లు న్యూస్ వినిపిస్తోంది. ప్రస్తుతం యూఎస్ లో ఉన్న తారక్ ఇండియాకి రాగానే ఈ ఎపిసోడ్ షూట్ జరగనుందని.. ఈ ఎపిసోడ్ లో కళ్యాణ్ రామ్ కూడా పాల్గొననున్నాడని వినికిడి.