![]() |
![]() |

సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా నటించిన `శ్రీమంతుడు` (2015) చిత్రంతో నిర్మాణ రంగంలోకి తొలి అడుగేసింది మైత్రీ మూవీ మేకర్స్. మొదటి సినిమాతోనే సంచలన విజయం అందుకుని వార్తల్లో నిలిచింది. ఆపై `జనతా గ్యారేజ్` (2016), `రంగస్థలం` (2018) వంటి బ్లాక్ బస్టర్స్ తో హ్యాట్రిక్ బేనర్ అయిపోయింది. రీసెంట్ గా `ఉప్పెన`, `పుష్ప - ద రైజ్` (2021)తోనూ సెన్సేషనల్ హిట్స్ చూసింది. కాగా, త్వరలో మహేశ్ నటించిన `సర్కారు వారి పాట`తో మరోసారి పలకరించబోతోంది. పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ భారీ బడ్జెట్ మూవీ ఈ నెల 12న జనం ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే, మహేశ్ బాబు కాంబినేషన్ లోనే మరో సినిమా నిర్మించేందుకు మైత్రీ సన్నాహాలు చేస్తోందట. అయితే, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనూ, దర్శకధీరుడు రాజమౌళితోనూ మహేశ్ చేయబోయే చిత్రాల తరువాత మైత్రీ మూవీ మేకర్స్ వారి ఫిల్మ్ ఉంటుందని టాక్. త్వరలోనే మహేశ్ - మైత్రీ థర్డ్ జాయింట్ వెంచర్ పై క్లారిటీ రానుంది.
కాగా, మహేశ్ - త్రివిక్రమ్ కాంబో మూవీని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనుండగా.. మహేశ్ - రాజమౌళి కాంబినేషన్ ప్రాజెక్ట్ ని శ్రీ దుర్గా ఆర్ట్స్ సంస్థ ప్రొడ్యూస్ చేయనుంది.
![]() |
![]() |