గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(ram charan)అప్ కమింగ్ మూవీ గేమ్ ఛేంజర్(game changer)ఇండియన్ గ్రేటెస్ట్ డైరెక్టర్ శంకర్(shankar)దర్సకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ మీద చరణ్ అభిమానుల్లోను,ప్రేక్షకుల్లోను భారీ అంచనాలే ఉన్నాయి.ఇప్పటికే రిలీజైన టీజర్ తో పాటు మూడు సాంగ్స్ కూడా ఒక రేంజ్ లో ఉండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయని కూడా చెప్పవచ్చు.
ఇక అభిమానులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల డిసెంబర్ 21 న యుఎస్ లోని టెక్సాస్ లో జరగబోతుంది.ఇండియన్ సినిమా చరిత్రలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అవుట్ అఫ్ కంట్రీ వేదికగా జరుపుకోవడం ఇదే ఫస్ట్ టైం అని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు ఈ ఈవెంట్ కి ప్రముఖ దర్శకుడు సుకుమార్ చీఫ్ గెస్ట్ గా హాజరు అవుతున్నాడనే రూమర్స్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.పుష్ప 2 సక్సెస్ తో సుకుమార్ పేరు ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా మారుమోగిపోతుంది.పైగా పుష్పతో వెయ్యి కోట్ల క్లబ్ లో కూడా అతి త్వరలోనే చేరబోతున్నాడు.
ఇక సుకుమార్ తన నెక్స్ట్ మూవీని చరణ్ తో చెయ్యబోతున్న విషయం తెలిసిందే.దీంతో సుకుమార్(sukumar)కనుక గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తే గేమ్ ఛేంజర్ కి అదనపు క్రేజ్ వచ్చే అవకాశం ఉంది.పైగా ఆ ఈవెంట్ లో చరణ్ తో చేసే మూవీకి సంబంధించిన డిటైల్స్ కూడా సుక్కు చెప్పే చాన్సస్ ఉన్నాయి.చరణ్ ప్రస్తుతం కమిట్ అయిన బుచ్చిబాబు మూవీ తర్వాత సుక్కు సినిమాని స్టార్ట్ చెయ్యబోతున్నాడు.గతంలో ఆ ఇద్దరి కాంబోలో వచ్చిన రంగస్థలం భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.