![]() |
![]() |

సిల్వర్ స్క్రీన్ పై కొన్ని కాంబినేషన్స్ చూడాలంటే ప్రేక్షకులు ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. ఆ కాంబో గురించి రూమర్ గా అయినా, చిన్న న్యూస్ వచ్చినా చాలు, సిల్వర్ స్క్రీన్ పై ఆ కాంబో రావాలని అభిమానులతో పాటు ప్రేక్షకులు తమ ఇష్ట దైవాలని ప్రార్థిస్తారు. అంతటి శక్తి కొన్ని కాంబినేషన్స్ కి ఉంటుంది.
దర్శకుడు 'సందీప్ రెడ్డి వంగ'(sandeep reddy vanga)పాన్ ఇండియా స్టార్ 'ప్రభాస్'(Prabhas)తో 'స్పిరిట్'(Spirit)అనే టైటిల్ తో ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే షూటింగ్ కి వెళ్లనుంది. ఈ మూవీలో ప్రభాస్ కి తండ్రిగా 'మెగాస్టార్ చిరంజీవి'(chiranjeevi)చేయబోతున్నారనే రూమర్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. చిరంజీవి రోల్ ఎంతో పవర్ ఫుల్ గా ఉండబోతుందని, ఈ మేరకు చిరంజీవిని ఒప్పించే ప్రయత్నాల్లో సందీప్ రెడ్డి ఉన్నాడనే మాటలు కూడా సినీ సర్కిల్స్ లో వినపడుతున్నాయి.
పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా స్పిరిట్ తెరకెక్కనుండగా, ప్రభాస్ పోలీస్ క్యారక్టర్ లో కనిపిస్తున్నాడు. ఒక వేళ ఈ రూమర్ నిజమైతే చిరంజీవి ఎలాంటి క్యారక్టర్ లో కనిపిస్తాడనే చర్చ అభిమానుల్లో జరుగుతుంది. చిరంజీవి కొన్ని రోజుల క్రితం జరిగిన 'నాగార్జున'(Nagarjuna),ధనుష్(Dhanush)ల 'కుబేర'(Kuberaa)సక్సెస్ మీట్ కి హాజరయ్యాడు. ఆ సందర్భంలో చిరంజీవి మాట్లాడుతు కుబేర లో నాగార్జున చేసిన ప్రయోగం నాకు ఎంతో ఆదర్శం. నేను కూడా అలాంటి స్పెషల్ క్యారెక్టర్లలలో కనిపిస్తానని అనేలా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ తండ్రి గా చిరంజీవి చేయబోతున్నారనే రూమర్ వైరల్ గా మారింది. చిరంజీవి, ప్రభాస్ మధ్య మాత్రం సుదీర్ఘ కాలం నుంచి ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పైగా ఒకే ఊరుకి చెందిన వాళ్ళు. సందీప్ రెడ్డి వంగ చిరంజీవికి వీరాభిమాని.

![]() |
![]() |