పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా వేగంగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో 'బ్రో', 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరిహర వీరమల్లు' వంటి సినిమాలు ఉన్నాయి. ఇందులో 'బ్రో' సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే పవన్ తాజాగా మరో సినిమాకి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అది కూడా 'బ్రో' మూవీ డైరెక్టర్ సముద్రఖనితో మరో సినిమా చేయనున్నారని సమాచారం.
తెలుగు ప్రేక్షకులకు సముద్రఖని నటుడిగానే ఎక్కువగా తెలుసు. కానీ ఆయనలో అద్భుతమైన దర్శకుడు కూడా ఉన్నారు. విభిన్న చిత్రాలతో తమిళ్ లో దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న సముద్రఖని 2021 లో తాను నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం 'వినోదయ సిత్తం'తో ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ సినిమాని 'బ్రో' పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణకి సముద్రఖని చాలా తక్కువ సమయం తీసుకున్నారు. సముద్రఖని పనితనం, స్పీడ్ ని మెచ్చిన పవన్ ఆయనకు మరో అవకాశం ఇచ్చినట్లు న్యూస్ వినిపిస్తోంది. 'బ్రో' విడుదలయ్యాక ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించనున్నారని అంటున్నారు. అంతేకాదు ఇది రీమేక్ కాదని, పవన్ కోసం సముద్రఖని ఓ కొత్త కథని సిద్ధం చేస్తున్నారని వినికిడి.