కోవిడ్ తర్వాత మన సినిమా రూపురేఖలే మారిపోయాయి. అంతవరకు ఏడాదికి ఎన్ని చిత్రాలు చేసాం... ఎన్ని కోట్లు వచ్చాయి... ఎన్ని కోట్లు వెనకేసుకున్నాం అనే తరహాలో ఆలోచించినా స్టార్ హీరోలు సైతం ఇప్పుడు సినిమాల సంఖ్య ముఖ్యం కాదని సినిమా కంటెంట్ ముఖ్యమని నమ్ముతున్నారు. కంటెంట్ కోసం ఎంత పెద్ద త్యాగానికైనా సిద్ధపడుతున్నారు. తమ చిత్రాలు పాన్ ఇండియా లెవెల్లో సంచలనం సృష్టించాలని ఆశపడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే దర్శకులు కూడా అద్భుతమైన కంటెంట్‌తో స్టార్ హీరోలను లైన్ లో పెడుతున్నారు.
ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్పాది రైజ్ కు సీక్వెల్ గా పుష్పాది రూల్ అంటే పుష్పా2 చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పుష్పరాజ్ పాత్రను ఆయన పోషిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల ఐదారు రోజులు జరిపి తర్వాత వాయిదా వేశారు. త్వరలో సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. కాగా లోకేష్ కనకరాజ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నారు. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. విశ్వనటుడు కమల్ హాసన్ కు ఎంతో కాలం తర్వాత అసలు సిసలు మజాని ఈ చిత్రం అందించింది.
ఈ చిత్రం చాలా కాలంగా ఎదురుచూసిన హిట్టును అందించి కమల్ కు ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ఈ చిత్రంలో చివర్లో వచ్చిన రోలెక్స్ పాత్రలో హీరో సూర్య ఎంతటి ఇంపాక్ట్ కలిగించారో అందరికీ తెలిసిందే. సూర్య ఈ క్యారెక్టర్ లో కనిపించి అందరినీ షాక్ కు గురి చేశారు. ఇప్పుడు అదే తరహాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కనిపించబోతున్నాడు అంటే అవుననే సమాధానం వస్తుంది. లోకేష్ కనకరాజు ప్రస్తుతం విజయ్ తో చిత్రం చేస్తున్నారు. ఇది మాస్టారుకు కొనసాగింప లేదా సరికొత్త కథా అనేది తెలియాల్సి ఉంది. సినిమాటిక్ యూనివర్స్ నేపథ్యంలో సాగే భారీ యాక్షన్ డ్రామా ఖైదీ 2 విక్రం 2ని కూడా లోకేష్ తెరకెక్కించనున్నారు.
ఈ రెండు సీక్వెల్స్ లో రోలెక్స్ తరహా పవర్ఫుల్ క్యారెక్టర్ ఒకటి ఉందట. ఆ క్యారెక్టర్ కోసం అల్లు అర్జున్ ని తీసుకోవాలని లోకేష్ కనక రాజ్ ఉద్దేశంగా కనిపిస్తోంది. ఈ రెండు రోలెక్స్ పాత్రలు ముగిసిన తర్వాత అంటే ఈ రెండు సీక్వెల్స్ పూర్తయిన వెంటనే అల్లు అర్జున్ క్యారెక్టర్ మీదనే ఫుల్ లెన్త్ మూవీ ని కూడా లోకేష్ కనకరాజు ప్లాన్ చేస్తున్నాడట. ఈ విషయమై అల్లు అర్జున్‌తో ప్రస్తుతం లోకేష్ కనకరాజు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.