మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీసు వద్ద కలెక్షన్లను ఊచ కోత కోస్తోంది. మెగాస్టార్ చిరంజీవిని చాలాకాలం తర్వాత బాబి ఇలా ప్రేక్షకుల మెచ్చుకునే, అభిమానులకు నచ్చే విధంగా సినిమా తీశాడని ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి గా ఉన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు బాబి వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇక వాల్తేరు విజయానికి దర్శకుడు కొరటాల శివ కూడా కారణమని షాకింగ్ కామెంట్ చేశారు. బాబి వీరయ్య సినిమా స్క్రిప్టులో భాగమైనందుకు కొరటాలకు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ఈ సినిమాలోని ఓ కామెడీ సీన్ పై కూడా స్పందించారు. చాలా సీన్స్ లో చిరంజీవి ఇచ్చిన సలహాలు ఎంతో బాగా వర్క్ అవుట్ అయ్యాయని బాబి చెప్పుకొచ్చారు.
ఓ కామెడీ సీన్ లో భాగంగా చిరు సోషల్ మీడియాలో పాపులర్ అయిన జారు మిఠాయి పాటను తన శైలో పాడుతారు. ఈ పాట పెట్టాలనే ఆలోచన చిరంజీవిదే అని బాబి బయట పెట్టారు. నేను లుంగీ ఎత్తే చూడు.... లుంగి ఎత్తే చూడు అని తన మార్కు కామెడీ పండించారు. ప్రేక్షకులు ఈ సీన్ వచ్చినప్పుడు నానా హడావుడి చేశారు. ఇదిలా ఉంటే మంచు ఫ్యామిలీకి కౌంటర్ గానే మెగాస్టార్ ఈ పాట పెట్టాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో బాబీ ఇచ్చిన క్లారిటీ కూడా దానికి మరింత బలం చేకూర్చేలా ఉందని చెప్పాలి. దీనిని మెగాస్టార్ చిరంజీవి పెట్టించాడని ఇది ఆయన నిర్ణయం మేరకు మాత్రమే జరిగిందని ఆయన ఇచ్చిన సలహా వల్లనే ఈ పాటను పెట్టామని బాబీ క్లారిటీ ఇచ్చారు. మంచు ఫ్యామిలీ ఈవెంట్‌లో పాపులర్ అయిన పాటను చిరంజీవి కావాలనే పెట్టాడన్న వాదనని బాబి చెప్పిన మాటలు మరింత బలపరిచినట్లు అయింది. మరి ముందు ముందు మంచు ఫ్యామిలీ కుటుంబం దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.