![]() |
![]() |
.webp)
`బాహుబలి` సిరీస్, `ఆర్ ఆర్ ఆర్`తో పాన్ - ఇండియా సూపర్ డైరెక్టర్ అనిపించుకున్నారు దర్శకధీరుడు రాజమౌళి. త్వరలో ఆయన సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఓ క్రేజీ ప్రాజెక్ట్ ని తెరకెక్కించనున్నారు. ఈ సంవత్సరాంతంలో ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం.
ఇదిలా ఉంటే, ఈ సినిమాలో మహేశ్ బాబు పోషించనున్న పాత్రకి సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. టైమ్ ట్రావెల్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ స్పై థ్రిల్లర్ లో.. మహేశ్ ఓ `రా ఏజెంట్`గా దర్శనమివ్వనున్నారట. అంతేకాదు.. ఈ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని అంటున్నారు. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.
కాగా, మహేశ్ బాబు ప్రస్తుతం `సర్కారు వారి పాట` చేస్తున్నారు. పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ వేసవి కానుకగా మే 12న రిలీజ్ కానుంది. ఆపై మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు మహేశ్. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. ఏడాది చివరకల్లా పూర్తి కానుంది. అదయ్యాకే.. జక్కన్న - మహేశ్ కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్ళనుందని టాక్.
![]() |
![]() |