![]() |
![]() |

ప్రస్తుతం చేతినిండా సినిమాలున్న కథానాయికల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. హిందీలో `రన్ వే 34`, `మిషన్ సిండ్రెల్లా`, `డాక్టర్ జి`, `థాంక్ గాడ్`, `ఛత్రివాలి` వంటి చిత్రాల్లో నటిస్తున్న రకుల్.. దక్షిణాదిన `అయలాన్` (తమిళ్), `31 అక్టోబర్ లేడీస్ నైట్` (తెలుగు - తమిళ్) వంటి సినిమాల్లో అభినయిస్తోంది. కాగా, తాజాగా ఈ ముద్దుగుమ్మకి తమిళనాట ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే ఛాన్స్ దక్కిందట.
ఆ వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ టాప్ స్టార్ అజిత్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. `నేర్కొండ పార్వై`, `వలిమై` తరువాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని.. బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. ఇటీవలే సెట్స్ పైకి వెళ్ళిన ఈ సినిమాలో కథానాయికగా రకుల్ ప్రీత్ సింగ్ ఎంపికైందని సమాచారం. అదే గనుక నిజమైతే.. అజిత్ కి జోడీగా రకుల్ నటించే మొదటి చిత్రం ఇదే అవుతుంది. అలాగే, `తీరన్ అధిగారమ్ ఒండ్రు` (తెలుగులో `ఖాకి`) తరువాత వినోద్ దర్శకత్వంలో రకుల్ నటించే సినిమా ఇదే అవుతుంది. త్వరలోనే అజిత్ - వినోద్ థర్డ్ జాయింట్ వెంచర్ లో రకుల్ ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి.. అజిత్, రకుల్ జోడీ వెండితెరపై ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.
![]() |
![]() |