![]() |
![]() |

- టాలీవుడ్ లో క్రేజీ మల్టీస్టారర్
- యంగ్ హీరోతో కలిసి రవితేజ డబుల్ ధమాకా
మల్టీస్టారర్ సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఇప్పుడు టాలీవుడ్ లో ఓ క్రేజీ మల్టీస్టారర్ కి అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ ఓ యంగ్ హీరోతో కలిసి మల్టీస్టారర్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. (Ravi Teja)
కెరీర్ స్టార్టింగ్ లో పలువురు హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న రవితేజ.. హీరోగా నిలదొక్కుకున్న తర్వాత ఎక్కువగా సోలో సినిమాలే చేస్తూ వస్తున్నారు. రెండేళ్ల క్రితం చిరంజీవి సినిమా 'వాల్తేరు వీరయ్య'లో ప్రత్యేక పాత్రలో కనిపించి సర్ ప్రైజ్ చేశారు. అలాంటిది ఇప్పుడు రవితేజ ఓ మల్టీస్టారర్ కి సిద్ధమవుతున్నారనే వార్త ఆసక్తికరంగా మారింది.
రవితేజ, నవీన్ పోలిశెట్టి కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. ప్రసన్నకుమార్ బెజవాడ కథ అందిస్తున్న ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించే అవకాశముంది అంటున్నారు. ప్రసన్నకుమార్, త్రినాథరావు నక్కిన కలిసి గతంలో రవితేజతో 'ధమాకా' సినిమా చేయడం విశేషం. (Naveen Polishetty)
ప్రసన్నకుమార్ రైటర్ అంటే కామెడీ సినిమా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. రవితేజ కామెడీ టైమింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. అలాగే నవీన్ పోలిశెట్టి కూడా చేసింది తక్కువ సినిమాలే అయినా.. తనదైన కామెడీ టైమింగ్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటిది రవితేజ-నవీన్ కలిస్తే ఎంటర్టైన్మెంట్ డబుల్ అవుతుంది అనడంలో డౌట్ లేదు.
Also Read: పవర్ స్టార్ ఊచకోత.. ఓటీటీలో ఓజీకి దిమ్మతిరిగే రెస్పాన్స్!
ప్రస్తుత సినిమాల విషయానికొస్తే అక్టోబర్ 31న 'మాస్ జాతర'తో ప్రేక్షకులను పలకరించనున్నాడు రవితేజ. అలాగే 2026 సంక్రాంతికి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమాతో అలరించనున్నాడు. నవీన్ కూడా 'అనగనగా ఒక రాజు' చిత్రంతో 2026 సంక్రాంతి బరిలో దిగనున్నాడు.
![]() |
![]() |