![]() |
![]() |
రవితేజ కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమాలు చాలా ఉన్నాయి. వాటిలో ‘కిక్’ చిత్రానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో యాక్షన్, కామెడీ, పబ్లిక్ కాజ్ వంటి అంశాలన్నీ సమపాళ్ళలో ఉండడంతో ప్రేక్షకులకు ఈ సినిమా మాంచి కిక్ ఇచ్చింది. ఈ సినిమాతో తమన్‌కి మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి బ్రేక్ వచ్చింది. దాదాపు 16 సంవత్సరాల క్రితం విడుదలైన ఈ సినిమా కమర్షియల్‌గా పెద్ద విజయం సాధించి 30 కోట్లు కలెక్ట్ చేసింది. 6 సంవత్సరాల తర్వాత ఇదే కాంబినేషన్లో కిక్కి సీక్వెల్‌గా కిక్2 వచ్చింది. అయితే ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ అవ్వలేదు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాలేదు.
ఆమధ్య అఖిల్ అక్కినేని కాంబినేషన్లో సురేందర్‌రెడ్డి చేసిన ‘ఏజెంట్’ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ తర్వాత మరో సినిమా చెయ్యలేదు. అయితే వెంకటేష్ కోసం ఒక కథను సిద్ధం చేసుకొని అతనితో రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నాడు. అయితే త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా ఓకే అవ్వడంతో సురేందర్‌రెడ్డి పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. దాదాపు పదేళ్ళ తర్వాత రవితేజ, సురేందర్‌రెడ్డి కాంబినేషన్లో సినిమా రాబోతోందనే వార్త వైరల్ అవుతోంది. వీరి కాంబినేషన్లో రాబోయే సినిమాకి సంబంధించిన కథా చర్చలు రెగ్యులర్‌గా జరుగుతున్నాయని తెలుస్తోంది. వెంకీకి చెప్పిన కథతోనే రవితేజ కాంబినేషన్లో సినిమా చేసేందుకు సురేందర్ రంగం సిద్ధం చేసుకుంటున్నాడని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. రవితేజతో సినిమా అనుకోవడానికి ముందే పవన్‌కళ్యాణ్‌తో కూడా సురేందర్‌రెడ్డి ఒక సినిమా చేస్తాడని, ఆ సినిమా ఫైనల్ స్టేజ్‌లో ఉందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం పవన్‌కళ్యాణ్ బిజీ షెడ్యూల్ దృష్ట్యా సురేందర్‌కి సినిమా చేస్తాడా? ఒకవేళ చేస్తే అది ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు అనే దానిపై కూడా సందేహాలు ఉన్నాయి. అయితే పవన్‌కళ్యాణ్, రవితేజలతో టచ్‌లో ఉన్నాడు సురేందర్. ఇదిలా ఉంటే.. రవితేజ లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’ అక్టోబర్ 31న విడుదల కాబోతోంది. ఈ సినిమా తర్వాత కిశోర్ తిరుమలతో ఒక సినిమా, కళ్యాణ్ శంకర్‌తో ఒక సినిమా, శివ నిర్వాణతో ఒక సినిమా చేసేందుకు రవితేజ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. మూడు సినిమాలతో బిజీగా ఉన్న రవితేజ.. సురేందర్‌రెడ్డితో ఇప్పట్లో సినిమా చేస్తాడా అనే సందేహం కూడా ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. ఒకవేళ పవన్‌తో చేసే సినిమా లేట్ అవుతుంది అనుకుంటే రవితేజతోనే సినిమా చేసే అవకాశం ఉంది. అయితే మూడు సినిమాలు చేతిలో ఉండడం వల్ల రవితేజ ఎంతవరకు సురేందర్‌కి అవకాశం ఇస్తాడు అనేది సందేహం. దాంతో సురేందర్ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడు అనే విషయంలో క్లారిటీ లేదు. ఏది ఏమైనా ‘కిక్’ కాంబినేషన్ రిపీట్ అవుతోందనేది మాత్రం కన్ఫర్మ్ అని తెలుస్తోంది.
![]() |
![]() |