![]() |
![]() |
- నిర్మాతలకు ఓటీటీల కొత్త కండిషన్
- థియేటర్లలో సినిమా రిజల్ట్ తేడా వస్తే..
- అలా చేస్తేనే నిర్మాతలు అగ్రిమెంట్లు ఇచ్చేవారు
ఓటీటీ సంస్థలు ఇప్పుడు నిర్మాతలకు మరో కొత్త తలనొప్పి తెచ్చిపెడుతున్నాయని తెలుస్తోంది. వారు ఇచ్చే పెద్ద మొత్తం డబ్బు కోసం దర్శకనిర్మాతలు తమ సినిమాలను భారీ బడ్జెట్‌తో, భారీ హంగులతో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సినిమాల రిలీజ్ డేట్‌లను కూడా ఓటీటీ సంస్థలు ఫిక్స్ చేస్తూ వస్తున్నారు.
ఇప్పుడీ సంస్థలు మరో కొత్త కండీషన్ పెట్టడం వల్ల నిర్మాతలు మరింత ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తోంది. కాంబినేషన్ కావచ్చు, సినిమా మీద ఉన్న క్రేజ్ కావచ్చు.. ఓటీటీ సంస్థలు ఔట్ రేట్‌కి ఆ సినిమాలను కొంటారు. కొంత అమౌంట్ ముందుగా కట్టి సినిమా స్ట్రీమింగ్‌కి వచ్చే ముందు మిగతా డబ్బు చెల్లించేవారు. అలా చేస్తేనే నిర్మాతలు అగ్రిమెంట్లు ఇచ్చేవారు. ఇప్పటివరకు అదే పద్ధతి నడుస్తోంది.
Also Read: వివాదంలో ఆది.. క్షమాపణలు చెప్పాలని ఫ్యాన్స్ డిమాండ్
అగ్రిమెంట్‌లో ఉన్న విధంగా సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా అనుకున్న మొత్తం ఓటీటీ సంస్థలు నిర్మాతలకు డబ్బు చెల్లించాలి. అయితే కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. అప్పుడు కూడా అనుకున్న డబ్బు నిర్మాతలకు ఇవ్వాలి. కానీ, ఇప్పుడా పద్ధతికి ఓటీటీ సంస్థలు స్వస్తి పలుకుతున్నాయని తెలుస్తోంది. థియేటర్లలో సినిమాల రిజల్ట్‌ని బట్టి అగ్రిమెంట్లలో కూడా మార్పులు జరుగుతున్నాయని సమాచారం.
సినిమాకి మొదట ఒక రేటు అనుకున్నప్పటికీ రిజల్ట్‌లో తేడా వస్తే ఫుల్ ఎమౌంట్ ఇవ్వకుండా దానిలో కొంత ఎమౌంట్ కట్ చేస్తామని ఓటీటీ సంస్థలు చెబుతున్నాయట. ఓటీటీ పెడుతున్న కండిషన్లను కూడా అంగీకరించి నిర్మాతలు అగ్రిమెంట్స్ చేయించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉంది అనేది అధికారికంగా తెలియకపోయినా ప్రచారం మాత్రం ఉధృతంగానే జరుగుతోంది. ఇప్పటికే నిర్మాతలపై ఓటీటీ పెత్తనం చేస్తోందనే విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ కొత్త కండిషన్ వల్ల నిర్మాతలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది.
Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
![]() |
![]() |