![]() |
![]() |

'కార్తీక దీపం' సీరియల్‌కు ఉన్న పాపులారిటీ మామూలుది కాదు. కొంత కాలం క్రితం కేవలం తెలుగులోనే కాకుండా, యావద్దేశంలోనే నంబర్ వన్ సీరియల్‌గా టాప్ రేటింగ్‌ను సాధించింది. అంతగా ఆ ధారావాహిక తెలుగువారి హృదయాలను ఆకట్టుకుంది. ఆ సీరియల్ హీరోయిన్ దీప అలియాస్ వంటలక్క పాత్ర కూడా సీరియల్ రేంజ్‌లోనే పాపులర్ అయ్యింది. డాక్టర్ కార్తీక్ భార్యగా, ఇద్దరు కవల పిల్లల తల్లిగా వంటలక్క పాత్రలో ప్రేమి విశ్వనాథ్ ప్రదర్శించిన అభినయం అందరికీ ఆకట్టుకుంది. ఫలితంగా ఆమెకు ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువగా ఏర్పడింది.
'కార్తీక దీపం' సీరియల్‌లో డాక్టర్ బాబు, దీప పాత్రలకు దర్శకుడు కాపుగంటి రాజేంద్ర కొన్ని రోజుల క్రితం శుభం కార్డు వేసేశాడు. చిన్నవాళ్లయిన హిమ, శౌర్య పాత్రలను పెద్దవాళ్లను చేసి కథ నడిపిస్తున్నాడు. దీంతో వంటలక్క ఫ్యాన్స్ హర్టయ్యారు.
కాగా ప్రేమి విశ్వనాథ్‌కు గతంలో సినిమా ఆఫర్లు వచ్చినా డేట్స్ ప్రాబ్లెమ్ వల్ల చేయలేకపోయింది. ఇప్పుడు ఆమె తనకు వస్తున్న మూవీ ఆఫర్లలో మంచి పాత్రలనుకున్న వాటిని చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తోన్న మూవీలో ప్రేమికి అవకాశం వచ్చిందనీ, ఆమె కూడా ఆ క్యారెక్టర్ చెయ్యాలనే ఉత్సాహంతో ఉన్నదనీ తెలుస్తోంది. కథలో ఆమె పాత్రకు తగినంత ప్రాధాన్యం కూడా ఉందట. త్వరలోనే మనకు ఆమె ఆ సినిమా చేస్తోందీ, లేనిదీ వెల్లడి కానున్నది.
![]() |
![]() |