![]() |
![]() |

గతేడాది 'క'తో ఘన విజయాన్ని ఖాతాలో వేసుకున్న కిరణ్ అబ్బవరం.. ఈ ఏడాది 'దిల్ రూబా'తో నిరాశపరిచాడు. ప్రస్తుతం కిరణ్ చేతిలో 'కె-ర్యాంప్', 'చెన్నై లవ్ స్టోరీ'తో పాటు పలు సినిమాలు ఉన్నాయి. తాజాగా ఓ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా కమిట్ అయినట్లు తెలుస్తోంది. (Kiran Abbavaram)
ఇండియాలో సంచలన విజయం సాధించిన వెబ్ సిరీస్ లలో 'మిర్జాపూర్' ఒకటి. ఈ సిరీస్ కి ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటిదాకా మూడు సీజన్లు రాగా.. దర్శకులుగా పలువురు వ్యవహరించారు. వారిలో ఆనంద్ అయ్యర్ కూడా ఒకరు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో సినిమా చేయడానికి కిరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ నిర్మించనుందట.
కొన్నేళ్లుగా హీరోలందరూ పాన్ ఇండియా మార్కెట్ పై దృష్టి పెడుతున్నారు. యంగ్ హీరోలు కూడా పాన్ ఇండియా సక్సెస్ లతో సర్ ప్రైజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కిరణ్ కూడా పాన్ ఇండియా మార్కెట్ పై దృష్టి పెడుతున్నాడు. నిజానికి 'క' సినిమాతోనే పాన్ ఇండియా కలలు కన్నాడు కిరణ్. కానీ, నెరవేరలేదు. ఇప్పుడు 'మిర్జాపూర్' దర్శకుడితో ఆ కలలు నెరవేరతాయేమో చూడాలి.
![]() |
![]() |