Facebook Twitter
మణిపూర్ లో మారణహోమం..?

మొన్న చంద్రయాన్.‌‌..3
నిప్పులు చెరుగుతూ
నింగికెగిరి చంద్రుడి
దక్షిణ ధృవం వైపు
విజయవంతంగా
దూసుకొని
పోతున్ననందుకు
గర్వంగా తలెత్తుకున్న
140 కోట్లమంది
భారతీయులను...సిగ్గుతో
తల దించుకునేలా చేసిన...
అతినీచమైన...
అమానుషమైన...
అమానవీయమైన...సంఘటన...

కొందరు
రాక్షసమూకలు
రక్షక భటుల కళ్ళెదుటే
అత్యాచారాలకు పాల్పడి ఇద్దరు
అమాయకపు "కుకీ మహిళలను"
నగ్నంగా నడివీధిలో ఊరేగించడం...
అది సోషిల్ మీడియాలో వైరల్ పోవడం...

అత్యున్నత
పీఠాన్ని
అధిరోహించిన
రాష్ట్రపతి ముర్మును...
ప్రధానమంత్రిమోడీని...
హోం శాఖా మంత్రి అమిత్ షాని...
సుప్రీంకోర్టు న్యాయమూర్తులను...
మహిళా కమీషన్ సభ్యులను..
అఖండ భారతావనిని...
విశ్వనరులను విస్మయానికి...
"దిగ్ర్భాంతికి" గురిచేసిన...
అతినీచమైన..‌.
అమానుషమైన...
అమానవీయమైన..‌.సంఘటన...

పోయిన హక్కులకై పోరాడే...
గిరిజన "కుకీ వ్యక్తి"తలనునరికి...
వెదురు కర్రకు...వ్రేలాడదీయడం...

ఎందరినో కదిలించిన
ఈ దురాగతాలకు అంతమెప్పుడు..?
మణిపూర్ లో జరిగే ఈ
దారుణ మారణహోమం ఆగేదెప్పుడు..?
మేధావులు నాయకులు మేల్కొన్నప్పుడు...
ప్రభుత్వం శాంతి ప్రణాళికలు
సిద్ధం చేసినప్పుడు...అప్పుడే...అప్పుడే...