Facebook Twitter
ఓటర్లు...ఒప్పందపత్రాలు…

ఔను ఇది రేపటి నిజం
రెండు మూడు 2000 పచ్చనోట్లకు...
మందుకు...మటన్ చికెన్ బిర్యానికి...
అమ్ముడుబోయి అమాయకపు ఓటరు ముందస్తుగా వ్రాసిచ్చే "ఒప్పందపత్రం"

ఆ అమాయకపు ఓటర్లకు పంచాలని...
ఎన్నికల్లో ప్రత్యర్థుల్ని ఓడించాలని...
అక్రమంగా దోచుకున్నారు
గుట్టుగా దాచుకున్నారు
గోడల్లో గోనెసంచుల్లో బ్యాంకులాకర్లలో
గుట్టలుగా గుట్టలుగా 2000 నోట్లకట్టలు

కర్నాటక  ప్రజా తీర్పుతో ఉలిక్కిపడ్డ 
మాయదారి కేంద్రం మాస్టర్ ప్లాన్" వేసింది

ప్రత్యర్థులపై ప్రతీకారంతో
ఎన్నికల్లో వారిని చిత్తుగా
ఓడించడమే లక్ష్యంగా
ఓటర్లకు "నోట్ల"...ఎరవేసి
"ఓట్ల చేపలు"... పట్టేందుకు
"2000 నోట్లకట్టల వలల్ని"చించి
వారి కలల్ని... ఎన్నికల ఫలితాల్ని
తారుమారు చేసే దురుద్దేశంతో...
కేంద్రం "2000 నోటును" రద్దుచేసింది

ప్రతిపక్షం ప్రత్యామ్నాయం వెతుకుతోంది
130 రోజుల సమయముంది...
మొన్న దాచిన 2000 నోట్లకట్టలను
రహస్యంగా ఓటర్లకు పంచిపెట్టి
రానున్న అసెంబ్లీ పార్లమెంట్
ఎన్నికల్లో " మీకే ఓటు వేస్తామంటూ"
ఓటర్ల "ముందస్తు ఒప్పందపత్రాలతో "

"కాకలు తీరిన రాజకీయ నేతలు
"కసరత్తులు"... ప్రారంభించారు.
"కరెన్సీ కత్తులు"...విసురుకుంటూ... 
"ఎన్నికల శంఖారావం" పూరిస్తూ...