Facebook Twitter
ఇంట పన్నీరు...కంట కన్నీరు..?

నిన్న...
టమోటాను..."నమ్మిన"
అన్నదాతల
బ్రతుకులు
అంధకారమాయే..!
గాడాంధకారమాయె..!

నేడు...
టమోటాను..."అమ్మిన"
అన్నదాతల
బ్రతుకులు
బంగారమాయె..!
పెట్టుబడి గిట్టుబాటాయె..!

నిన్న...
టమోటాను..."నమ్మిన"
అమాయకపు
అన్నదాతలలెందరో...
గిట్టుబాటు ధర లేక...
పెట్టుబడి ఖర్చులు రాక...
బ్యాంకు అప్పులు తీర్చలేక...
తాకట్టు పెట్టిన పుస్తెలు తేలేక...
ఆవేశంలో పురుగు మందు‌ త్రాగి...
"ఆత్మహత్యలు"...చేసుకున్నారాయె..!

నేడు...
టమోటాను..."అమ్మిన"
అదృష్టవంతులైన
అన్నదాతలెందరో
కలలుపండి..! కడుపునిండి..!
ఏ నక్కను తోక్కారో ఏమో...
ఒక్క నెలలో...ఒక్క రోజులో...
ఒక్క రాత్రిలో..."కోటీశ్వరులైపోయే"..!

కాలం కరుణిస్తే ప్రతి ఇంటా పన్నీరే..!
కరుణించకుంటే ప్రతి కంటా కన్నీరే..