Facebook Twitter
మన బంధాలే సుమగంధాలైతే..?

నిన్నటి ప్రాణ మిత్రులే
నేడు బద్ధ శత్రువులౌవుతున్నారు బంధువులు

రాబందులౌతున్నారు రక్తసంబంధీకులే రక్తాన్ని పిలుస్తున్నారు

ఎవరు మిత్రులో...
ఎవరు శత్రువులో...
ఏవి బంధాలో...అనుబంధాలో...
స్వచ్ఛమైన స్నేహబంధాలో...
నకిలీ వ్యాపారబంధాలో...
రక్తబంధాలో...రాక్షసబంధాలో...
ఎంతకూ ఈ మనిషికి అర్థం కాకున్నది
గుర్తుకొస్తే గుండె పగిలి రగిలి పోతుంది
మనసు ముక్కలై పోతున్నది...కళ్ళు
కన్నీళ్ళకు బదులు రక్తాన్ని శ్రవిస్తున్నవి

కారణం మానవుడు
దానవుడైపోతున్నాడు...
అడవి మృగమైపోతున్నాడు...
అంధుడౌతున్నాడు...
కామాంధుడౌతున్నాడు...అసలు
మనిషన్నవాడే మాయమైపోతున్నాడు

ఈ భవబంధాలను
పెంచేదెవరో..? శాసించేదెవరో ?
శాశ్వతంగా ఉంచేదెవరో..?
అర్ధాంతరంగా త్రుంచేదెవరో..?
ఎంతకూ ఈ మనిషికి అర్ధం కాకున్నది

కానీ ఈ మనిషిలోని
ఈ కులగజ్జిని...
ఈ మతపిచ్చిని...
ఈ బంధుప్రీతిని...
ఈ అర్ధంలేని స్వార్థాన్ని...
ఈ అంతులేని అహంకారాన్ని...
ఈ మానవత్వంలేని వ్యక్తిత్వాన్ని...
ఈ నక్క వినయాలను...
ఈ పగా ప్రతీకారాలను...
ఈ అసూయా ద్వేషాలను...
నిత్యం వీక్షించే...పరీక్షించే.సస
ఆ పరమాత్మకు సాధ్యమే
ఈ మనిషి ముందు జీవితాన్ని
బంధాలతో...సుమగంధాలతో నింపడం

అందుకే ఓ మానవా...ఇకనైనా మారవా..?
ఈ కంప్యూటర్ యుగంలోనైనా
నీ రెండు కళ్ళు తెరుచుకొని
ఒక నిండు నిజాన్ని తెలుసుకోవా..?
ఈభువిపై బంధాలులేని బ్రతుకొక నరకమని
సత్సంబంధాలున్న చాలు నదొక స్వర్గసీమని