అది నీవు గుర్తించగలిగేది? ఎప్పుడు?..
ఆ సమయంలో
అందరూ దగ్గరుంటే చాలు
కళ్లకు కనిస్తే చాలు
కొండంత ధైర్యము
ఏనుగంత బలము
సముద్రమంత సంతోషము
ఆకాశమంత ఆనందము
బంధాలు
అనుబంధాలు ఆత్మీయతలు
అవే మనిషికి
ఆయుష్షును ఆశలను పెంచేవి
ప్రేమానురాగాలను పంచేవి
అసూయ ద్వేషం కసి
పగప్రతీకారాలను త్రుంచేవి
అవే బలమైనబంధాలకు పునాదిరాళ్ళు
అవి అందినవాళ్లకు
భగవంతుడు ఇస్తాడు నిండునూరేళ్ళు
నీ జీవితంలో
నీకు ఎదురైనా ఎవరిలో కూడా
ఒక శతృవును చూడకు
ఎక్కడో లేడు దేవుడు
నీ మిత్రుడే నీ దేవుడు
నీప్రక్కనే నీతోనే వున్నాడు
అది నీవు గుర్తించగలిగేది
నీవు నీ మనోనేత్రంతో దర్శించగలిగితేనే



