Facebook Twitter
వంద సమస్యలు ఒక్కసారే వస్తే?

*పట్టుకోవచ్చు* 
ఎవరి యింటిలోకైనా
ఏదైనా ఒక్క పాము వస్తే
కాని ఒక్కసారే వంద పాములు వస్తే ఎలా?

*
తట్టుకోవచ్చు*
ఎవరికైనా ఏదైనా ఒక్క సమస్య వస్తే
కాని ఒక్కసారే వంద సమస్యలు వస్తే ఎలా?

*
కట్టుకోవచ్చు*
ఎప్పుడైనా ఏవైనా
వరదలు వచ్చి ఇల్లు పడిపోయినా
అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోయినా
కాని ఒక్కసారే భయంకరమైన భూకంపం వచ్చి ఇల్లు నేలమట్టమైతే ఎలా?

*
పెట్టుకోవచ్చు*
ఉంటానికి ఇళ్ళులేకపోయినా
తింటానికి తిండిలేకపోయినా సరే
చిన్నజబ్బు చేస్తే అప్పుచేసైనా
ఆసుపత్రి బిల్లులు
కాని మాయదారి జబ్బొకటొచ్చి ఆపరేషన్ కోసమై ఒక్కసారే
లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తే ఎలా

కాని మనల్నిఅన్నింటా
ఆదుకోనేవాడు ఆ దైవమే
నీ చేతిలో నా చేతిలో
ఏముంది నిమ్మకాయ