Facebook Twitter
సిగ్గులజ్జా లేని బ్రతుకేల?

"కుక్కా"అని తిట్టినా
ఒక్కమాట తిరిగి అననివాడు
"పంది" అంటే
పరమానందం పడేవాడు
"చెప్పుతో" కొట్టినా
చిరునవ్వు నవ్వేవాడు
"ముఖాన ఉమ్మేసినా"
ఉలుకూపలుకూ లేనివాడు
నలుగురు నవ్వుతున్నా
నడిబజార్లో
"అర్థనగ్నంగా" తిరిగేవాడు
ఎవ్వరు ఏమనుకున్నా
పర్వాలేదనుకునేవాడు
ముళ్ళదారిలో వెళ్లి
ముళ్ళుతొక్కి వెక్కివెక్కి ఏడ్చేవాడు
పాముల పుట్టలాంటి పాపాలపుట్టలో
చేతినికాదు తలను దూర్చి దుఃఖించేవాడు
సిగ్గులజ్జా అంటూ లేనివాడు....
వాడు మనిషా... కాదు  కాదు
వాడి బ్రతుకు ఒక‌ బ్రతుకా... కాదు
వాడొక బండ...కొండ...పనికిరాని మట్టికుండ