Facebook Twitter
భగవంతుడిచ్చిన బంగారు బహుమతి…

ఆమె ఆలోచనలు ఊహలు
అభివృద్ధికి సోపానాలు
ఆమె సమయస్ఫూర్తి
అద్భుతం ఆశ్చర్యకరం
ఆమె ఉచిత సలహాలు పాటిస్తే
ఉజ్వల భవిష్యత్తే 
ఆమె సేవాభావం
దయాగుణం ఆచరణీయం
ఆమె దూరదృష్టి గలది
ప్రతిది లోతుగా పరిశీలిస్తుంది
ఆమె పట్టుదల పట్టిందంటే
సాధించి తీరుతుంది
ఆమె సహనం సర్దుబాటుగుణం ఊహకందనిది
ఆమె ప్రేమతత్వం
మదర్ థెరిస్సానే మరపిస్తుంది
ఆమె క్షమాగుణం క్రీస్తునే గుర్తు చేస్తుంది
ఆమె మంచితనం
మానవత్వం అంతులేనిది
ఆమె కలుపుగోలుతనం
భగవంతుడిచ్చిన ఓ వరం
ఆమె ఓర్పు నేర్పు
ఇతరుల్లో తెస్తుంది గొప్ప మార్పు
ఆమె ఆతిథ్యం
అతిరుచికరం మరుపురానిది
ఆమె ఇచ్చే చక్కని సలహాలు ఆణిముత్యాలు
ఆమె ఉత్సాహం ప్రోత్సాహం
వెయ్యేనుగుల బలం
ఆమె అభిమానం పొందడం
ఒక అదృష్టం
ఆమె ఇతరుల ఇచ్చే గౌరవం
అంతులేనిది విలువైనది
ఆమె లౌకికం చాకచక్యం
అంతుచిక్కనిది
ఆమె భక్తిభావం అపారం
నిజం నిత్యనూతనం
ఆమె అనురాగం ఆప్యాయత
అమృతంతో సమానం
ఆమె కోపం క్షణికం
ఒక నీటి బుడగలాంటిది
ఆమె శాంతం సముద్రం కన్న మిన్న
ఆమె స్నేహానికి చక్కని చిరునామా
ఆమె మా కంటికి ఒక ఆశాజ్యోతి
ఆమె మా ఇంటికి ఒక ఆరని దీపం
ఆమె ఎవరో కాదు

నా చిరునవ్వుల శ్రీమతి
ఆమె భగవంతుడు నా కిచ్చిన
ఓ బంగారు బహుమతి